Home /News /telangana /

V.C Sajjanar : సజ్జనార్ మరో కీలక నిర్ణయం... అధికారులు, ఉద్యోగులు ఈ పని చేయాల్సిందే...

V.C Sajjanar : సజ్జనార్ మరో కీలక నిర్ణయం... అధికారులు, ఉద్యోగులు ఈ పని చేయాల్సిందే...

vc sajjanar

vc sajjanar

V.C Sajjanar : టీఎస్‌ఆర్టీసీ ఎండీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఆర్టీసీకి మరింత ఆదాయానికి మెరుగులు దిద్దుతున్న ఆయన సంస్థగతంగా మార్పులకు శ్రీకారం చుట్టారు...

    ఇక నుండి ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతి గురువారం ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే విధంగా చర్యలు చేపట్టారు. బస్సు దినోత్సవం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ( RTC officials and employees should travel by bus ) బస్సు దినోత్సవం రోజున ఆర్టీసీ అధికారులతో పాటు ఉద్యోగులందరు ఆర్టీసీ బస్సుల ల్లోనే ప్రయాణించాలని  ఎండీ సజ్జనార్  సూచించాడు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల వారి సమస్యలను నేరుగా తెలుసు కునే అవకాశం ఉంటుందని సజ్జనార్ అన్నారు.

    దీంతో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి.. మెరుగైన సేవలను అందించే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. కాగా తాను స్వయంగా పర్యటించిన తర్వాత ఎండీ సజ్జనార్ ఇలాంటీ నిర్ణయం తీసుకున్నారు.. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ నుండి నల్గోండకు సుమారు 70 కిలోమీటర్ల మేర ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణించారు. ( RTC officials and employees should travel by bus ) ఆ తర్వాత నల్గొండ బస్ స్టాండ్ ప్రాంతాలను పరీశీలించి అక్కడి ఉద్యోగులతో చర్చించారు. స్థానికంగా ఉన్న దుకాణ సముదాయాల్లో అధిక ధరలకు వస్తువులను అమ్ముతుండడంతో అది గమనించిన ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో కూడా ఎంఆర్‌పీ కే అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇలా అనేక సార్లు ఆయన పలు బస్‌స్టాండ్‌లను సందర్శించడంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఆయన ఆర్టీసి బస్సులో ప్రయాణం చేశారు.

    Telangana Schools - Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ స్కూళ్ల మూసివేత? క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితారెడ్డి.. వివరాలివే


    Rangareddy : రాయితో కొట్టి ..కొనఊపిరితో ఉన్నాడంటూ 100 డయల్ చేసిన ఓ బాలుడు


    ముఖ్యంగా ఆర్టీసి ఆదాయాన్ని పెంచడంతో పాటు నష్టాల నుండి బయటపడేసే ప్రయత్నాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అటు ప్రయాణికులతో పాటు ఇటు కార్మికులు భరోసా కల్పించే యత్నాలను సజ్జనార్ ముమ్మరం చేశారు. ( RTC officials and employees should travel by bus ) ఫలితంగా గతంలో ఎన్నడు లేనట్టుగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే సుమారు 14 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసి సమకూర్చుకుంది. దీంతో ఇప్పుడు తాజాగా ఉద్యోగులు సైతం ఆర్టీసీలో ప్రయాణించాలని సూచించడడం ద్వారా నేరుగా అధికారులే ఎప్పుటికప్పుడు తమ సంస్థ సమస్యలపై దృష్టి సారించే అవకాశాలుంటాయి.


    Cyber crime : సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్... అవును మోసం చేశాను.. ఏం చేస్తావ్... అంటూ...!




    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Sajjanar, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు