ఆర్టీసీని ఓవైపు పటిష్టం చేసే పనిలో ఉన్నతాధికారులు ఉండగా మరోవైపు కాలం చెల్లిన బస్సులతో పాటు ప్రైవేటు వాహానాల వల్ల సంస్థకు ఇబ్బందులు తలెత్తున్నాయి. కాగా తాజాగా ఓ ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అతివేగం వల్ల అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు తాండూరుకు వెళుతుంగా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కర్ఖోడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు ప్రయాణఇస్తున్నట్టు సమాచారం.
ఇక ప్రమాదం తర్వాత 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిని క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మర్పల్లి నుంచి వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాలోని మలసోమారం, పెద్దాపూర్, ఇందోల్, తాండూర్, సదాశివపేట్, మొరంగపల్లి, కొడంగల్, జహీరాబాద్, పద్దేముల్, కేశారం, తదితర గ్రామాలకు చెందిన ప్రయాణికులు గాయపడ్డారు.
ఇది చదవండి : హలో.. నేను సీఐడీ అధికారిని.. నువ్వు నాకు కావాలి.. ఎక్కడకు రమ్మంటావ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Telangana, Tsrtc