హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: బస్సుల్లో ‘మహిళల సమస్య’పై అర్ధరాత్రి ఓ యువతి ట్విటర్​లో విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

TSRTC: బస్సుల్లో ‘మహిళల సమస్య’పై అర్ధరాత్రి ఓ యువతి ట్విటర్​లో విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఆర్టీసీకి ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అర్ధరాత్రి కి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు

  నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPS) తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.

  ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా అర్ధరాత్రి (TSRTC) కి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి చెప్పుకొచ్చారు.

  ఆ యువతి అభ్యర్ధనకు వెంటనే ఎండీ సజ్జనార్ (Sajjanar) ట్వీట్ కి స్పందించారు. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు సజ్జనార్. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ నిషా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అంతే చురుగ్గా ఉంటూ.. ఆర్టీసీ ఉన్నతి కోసం ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఆదాయం పెంచడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు. సంక్రాంతికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు కూడా ఎలాంటి అనదపు ఛార్జీలు వసూలు చేయకుండా అందరూ టీఎస్ ఆర్టీసీ వైపు చూసేలా చర్యలు తీసుకున్నారు సజ్జనార్.

  ఇటీవలె ఓ జ‌ర్న‌లిస్టు.. ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటించే ఆశ్లీల పోస్ట‌ర్ల విష‌యాన్ని స‌జ్జ‌నార్ దృష్టికి తీసుకెళ్లగా.. నెటిజ‌న్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇలాంటి పోస్ట‌ర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ఇచ్చిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల ఫోటోల‌ను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

  కాగా, ఆర్టీసీలో వృథా ఖర్చులు తగ్గించి,  బస్టాండ్ లలో (Bus Stations) వివిధ సేవలకు డబ్బులను యూపీఐ (UPI), క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: RTC buses, Sajjanar, Tsrtc, Tweets, Women

  ఉత్తమ కథలు