హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఎజెండా వేరు... అశ్వత్ధామరెడ్డి

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఎజెండా వేరు... అశ్వత్ధామరెడ్డి

కార్మికులు చేస్తున్న సమ్మెను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కోణంలో చూడొద్దని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డి అన్నారు.

    కార్మికులు చేస్తున్న సమ్మెను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కోణంలో చూడొద్దని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డి అన్నారు. ఆర్టీసీ యూనియన్లపై సీఎం వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. గతంలో కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అశ్వత్ధామరెడ్డి డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ అవహేళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    నవంబర్ 15 లోపు ఏపీలో ఆర్టీసీ విలీనం జరగాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మీ ఎజెండా వేరు ఉందని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా చదివితే మంచిదని అశ్వత్ధామరెడ్డి అన్నారు. ఆర్టీసీ సమస్యను సీఎం కేసీఆర్ కార్మికుల కోణంలో చూడాలని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వలో కలిస్తే... యూనియన్లు ఉండవని వ్యాఖ్యానించారు.

    First published:

    Tags: CM KCR, Rtc jac, Telangana, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు