రెండో రోజుకు చేరిన అశ్వత్ధామరెడ్డి దీక్ష..

తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వ‌ర‌కు దీక్ష విర‌మించేది లేద‌ని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: November 17, 2019, 12:08 PM IST
రెండో రోజుకు చేరిన అశ్వత్ధామరెడ్డి దీక్ష..
అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారించాలంటూ నిరాహార దీక్షకు దిగిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్దామరెడ్డి... రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వ‌ర‌కు దీక్ష విర‌మించేది లేద‌ని ఆయన తేల్చి చెప్పారు. ఆర్టీసి కార్మికుల ప‌ట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని... ఆర్టీసి ఎండీ సునీల్ శ‌ర్మ రాజ‌కీయ నాయ‌కుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే అశ్వత్ధామరెడ్డి దీక్షను విర‌మింప‌జేసేందుకు పోలీసులు ఆయ‌న‌తో చ‌ర్చలు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసి కార్మికుల స‌మ్మె వ‌రుస‌గా 44వ రోజు కొన‌సాగుతుంది. ఈ సందర్భంగా ఆందోళనలకు దిగిన ఆర్టీసీ కార్మికులను పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల డిపో వ‌ద్ద ఆర్టీసి కార్మికులు బ‌స్సుల‌ను అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జ‌గిత్యాల, దుబ్బాక‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనూ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...