హోమ్ /వార్తలు /తెలంగాణ /

సమ్మె విరమణ...ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

సమ్మె విరమణ...ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

52 రోజుల సమ్మెకు ముగింపు పలుకుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

52 రోజుల సమ్మెకు ముగింపు పలుకుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

52 రోజుల సమ్మెకు ముగింపు పలుకుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

  నేటితో తాము సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఇది కార్మికుల నైతిక విజయమని కార్మిక సంఘం నేత అశ్వత్ధామరెడ్డి ప్రకటించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె ద్వారా కార్మికులు నైతిక విజయం సాధించారని వారు తెలిపారు. రేపటి నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని జేఏసీ నేతలు సూచించారు. వాళ్లెవరూ విధులకు హాజరుకావొద్దని కోరారు. తప్పని పరిస్థితుల్లోనూ సమ్మె విరమిస్తున్నామని... సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు జేఏసీ కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

  బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే తాము సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికప్పుడు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు కూడా కార్మికుల్లో కనిపించడం లేదు. దీంతో తమకు తాముగానే సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ప్రయత్నించాలని... ఈరకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి

  ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ... రేపు ఏం జరగనుంది ?

  First published:

  Tags: CM KCR, RTC Strike, Telangana RTC strike

  ఉత్తమ కథలు