హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: ఒకే ఒక్క ఐడియా.. ఆర్టీసీ ఆదాయం భారీగా పెంచింది.. ప్రయాణికుల కష్టాలను తీర్చింది

TSRTC: ఒకే ఒక్క ఐడియా.. ఆర్టీసీ ఆదాయం భారీగా పెంచింది.. ప్రయాణికుల కష్టాలను తీర్చింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSRTC: ఇప్పటికే టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) సేవలను అందిస్తున్న ఆర్టీసీ.. కొత్తగా ఐటీమ్ ( ఇంటలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ )ను ప్రవేశపెట్టింది. వీటీలో నగదు రహిత చెల్లింపులు చేసి టికెట్ కొనుగోలు చేయవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(శ్రీనివాస్. పి, న్యూస్ 18తెలుగు ప్రతినిధి, కరీంనగర్ జిల్లా)

ప్రస్తుతం దేశమంతటా నగదు రహిత లావాదేవీలు (Cashless Transactions) పెరిగిపోయాయి. ఒకప్పుడు బయటకు వెళ్లాలంటే పర్సులో డబ్బు పెట్టుకొని వెళ్లేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఉంటే సరిపోతుంది. ఏం కావాలనా.. ఎలాంటి వస్తువు కొనాలన్నా.. ఫోన్‌తో పేమెంట్స్ చేయవచ్చు. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు.. తోపుడు బండి సూపర్ మార్కెట్ వరకు.. అంతటా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి.. సెకన్లలో డబ్బులు చెల్లించవచ్చు. మారుతున్న కాలం దృష్ట్యాల.. ఆర్టీసీ (TSRTC) కూడా అప్‌డేట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కరీంనగర్ రీజియన్‌లో నగదు రహిత సేవలను ప్రవేశపెట్టింది. అవి అద్భుతమై ఫలితాలనిస్తున్నాయి. ప్రయాణికుల చిల్లర కష్టాలను తీర్చడంతో పాటు... ఆర్టీసికి ఆదాయం పెంచుతున్నాయి.

ఇప్పటికే టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) సేవలను అందిస్తున్న ఆర్టీసీ.. కొత్తగా ఐటీమ్ ( ఇంటలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ )ను ప్రవేశపెట్టింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 73 ఐ-టీమ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో స్మార్ట్‌ఫోన్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా ప్రయాణికులు చెల్లింపులు చేయవచ్చు. జేబులో డబ్బులు లేకున్నా.. క్యాష్‌లెస్ పేమెంట్స్ చేసి ప్రయాణించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లోని బస్ స్టాప్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విధానాన్ని అమలులోకి తెచ్చి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ కరీంనగర్ రీజియన్ పరిధిలో నెల రోజుల క్రితం ప్రవేశపెట్టారు . ముందుగా ప్రయోగాత్మకంగా దూర ప్రాంతాలకు వెళ్లే రాజధాని, గరుడ సర్వీసుల్లో క్యాష్‌లెస్ సేవలను ప్రారంభించారు.

Telangana: ఫ్రీ..:ఫ్రీ..ఫ్రీ.. మటన్ కొంటే చికెన్ ఉచితం.. అదిరిపోయే ఆఫర్.. ఎక్కడంటే.

11 ఆర్టీసీ డిపోల పరిధిలోని 6 గరుడ, 16 రాజధాని సర్వీసుల్లో ముందుగా అమలు చేశారు. అనంతరం లగ్జరీ బస్సుల్లో అమలు ప్రారంభించారు. ఇందుకోసం సిస్టమ్ సూపర్ వైజర్లకు ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. డిపోల వారీగా చూసుకుంటే గరుడ సర్వీసులు కరీంనగర్ -1 లో 4 , గోదావరిఖనిలో 2 ఉన్నాయి. రాజధాని సర్వీసులు కరీంనగర్ -1 లో 6 , గోదావరిఖనిలో 5 , జగిత్యాలలో 3 , కోరుట్లలో 2 బస్సులలో మొదట విజయవంతంగా అమలు చేశారు. ప్రస్తుతం లగ్జరీ బస్సుల్లో , బస్టాండులో ఉన్న బుకింగ్ కౌంటర్ల వద్ద అమలు చేస్తున్నారు. డిపోల వారిగా చూస్తే గోదావరిఖని డిపో పరిధిలో 14 , హుస్నాబాద్ పరిధిలో 3 , జగిత్యాల పరిధిలో 12 , కరీంనగర్ -1 పరిధిలో 19 , కరీంనగర్ - 2 డిపో పరిధి లో 5 , కోరుట్ల పరిధిలో 8 , మెట్పల్లి పరిధిలో 3 , మంథని , రాజన్న సిరిసిల్ల , వేములవాడ డిపోల పరిధిలో మూడేసి బస్సుల్లో ఐ.టీమ్ ద్వారా టికెట్లను జారీ చేస్తున్నారు.

ఆయా డిపోల నుంచి హైదరాబాద్ , బెంగుళూరులాంటి దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఇందులో నగదుతో కూడా టికెట్లు ఇస్తారు. అలాగే డిజిటల్ పేమెంట్స్‌తోనూ టికెట్ కొనుగోలు చేయవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ సిస్టంలో బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ ఫోన్‌తో ఫోన్ పే , గూగుల్ పే ద్వారా చెల్లించి టికెట్ కొనుక్కునే అవకాశం కల్పించారు. క్యాష్‌లెస్ పేమెంట్స్ తీసుకురావడం వల్ల.. కరీంనగర్ పరిధిలో బస్ డిపోలో ఆదాయం కూడా పెరిగిందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. చిల్లర సమస్యలు కూడా తగ్గాయని కండక్టర్స్ వెల్లడించారు.

First published:

Tags: Karimnagar, Telangana, Tsrtc

ఉత్తమ కథలు