ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ( RTC ex chairman Gone prakash rao ) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.. ఆదిలాబాద్ కలెక్టర్ తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారని చెబుతూ.. సీఎం కేసిఆర్ బాషాలో రెండు వేళ్లు చూపిస్తూ... ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాష్ రావే కాదంటూ సవాల్ విసిరారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చివరి రోజున 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఛాంబర్‌లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థులు కాకుండా... ఇతర నేతలు ఆమె చాంబర్‌లో సుమారు మూడు గంటల పాటు ఎందుకు ఉంటారని ఆయన ప్రశ్నించారు. ( RTC ex chairman Gone prakash rao ) ఈ క్రమంలోనే ఆ రోజు సీసీ ఫుటేజీ తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లు పాటించలేదని.. అన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిషాను కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే తన గురించి ఎంక్వయిరీ చేసిన కలెక్టర్ కు వార్నింగ్ ఇస్తున్నానంటూ కేసిఆర్ ‘కేసీఆర్ భాషలో లాగు తడవాలని అంటారు కదా.. నేను ఆమె చీర తడుపుతా’ అంటూ గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
V.C Sajjanar : సజ్జనార్ గిఫ్ట్ .. ఆ ఇద్దరు ఆడపిల్లలకు జీవితకాలం ఉచితం..
కాగా ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా రోజున కలెక్టరేట్ కార్యాలయంలో ( Collector office ) బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా.. నాటకీయ పరిణామాల మధ్య 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసినా, బరిలో నిలిచినా ఆదివాసి మహిళ నామినేషన్ ను ఉపసంహరించుకునేలా చేసిన వ్యూహం బెడిసికొట్టింది. చివరకు అధికార పార్టీ అభ్యర్థి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి బరిలో నిలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ( mlc elections ) ఒక్క ఓటు వచ్చినా సరే తాను పోటీ నుండి తప్పుకునే ప్రసక్తే లేదని, తాను చివరి వరకు ఈ ఎన్నికలో పోటీలో ఉంటానని నామినేషన్ల ఉపసంహరణ రోజే స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి ప్రకటించారు. మరోవైపు రాజేశ్వర్ రెడ్డి అనే స్వతంత్ర్య అభర్థి నామినేషన్ విత్ తాను చేసుకోలేదని ఎవరో ఫోర్జరీ చేశారని చెబుతున్నారు. దీనిపై కోర్టుకు వెళతానని చెబుతున్నారు. ఈక్రమంలోనే ఆదిలాబాద్ కలెక్టర్‌పై గోనే ప్రకాశ్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయితే ఆ రోజు కలెక్టర్ తన చాంబర్‌లో లేరని తెలుస్తోంది.
Medak : ముహుర్తానికి ముందే బంధువు మృతి.. కీడు అంటూ.. పెళ్లిని రద్దు చేసిన వరుడు... !
ఏది ఏమైనా.. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమని, కానీ ఒక కలెక్టర్‌పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని పలువురు నేతలు గోనె ప్రకాశ్‌ను తప్పుబడుతున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Mlc elections