Home /News /telangana /

RTC EMPLOYEES GET SALARIES ON FIRST OF EVERY MONTH VRY

RTC MD : ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు... ఉత్సాహాంతో పని చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RTC MD ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలిపారు.. ఇక నుండి ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రతినెల ఒకటవ తేదీనే అందించనున్నట్టు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. అయితే జీతాలు తీసుకున్నట్టుగానే ఆర్టీసీని ప్రగతిపథంలో తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

ఇంకా చదవండి ...
    నాలుగు నెలల్లో తెలంగాణ ఆర్టీసీ ( Telangana rtc ) నాలుగు నెలల్లో గాడీన పడకపోతే ప్రవైటు పరం చేస్తామన్న ఆర్టీసీ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.. ముందుగా కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని పక్కన పెట్టెందుకు కృషి చేస్తున్నారు. ఇందులో బాగంగానే వారికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వలేనే ప్రతినెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించి ఉన్న ఉద్యోగులతో పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు సిద్దమయ్యారు.

    అయితే గత మూడు సంవత్సారలుగా నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీ 2018 డిసెంబర్‌ వరకు ఉద్యోగులు,కార్మికులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూ ఇటుగా వేతనాలు పొందుతూ వచ్చారు. కానీ సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తర్వాత జీతాలు (Salaries)ఇవ్వడమే గగనంగా మారింది.

    ఇది చదవండి : పిల్లలను పక్కరూంలో పడుకోవాలని చెప్పిన తండ్రి.. అర్థరాత్రి పూట దారుణానికి దిగాడు...?


    దీంతో ప్రతి నెల పదవ తేదీ తర్వాత జోన్ల వారిగా జీతాలు ఇస్తున్నారు. అందరికి ఒకేసారి కాకుండా పరిస్థితిని బట్టి ఆయా ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ప్రతి నెల చివరి ఉద్యోగి జీతాలు అందే వరకు కనీసం నెలలో ఇరవై రోజులు గడుస్తున్నాయి.. ఇలా గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్, బస్‌భవన్‌ ఉద్యోగులకైతే సెప్టెంబర్‌లో 20వ తేదీన వేతనాలు అందుతున్న పరిస్థితి నెలకొంది.. దీంతో సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈఎంఐలు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.

    ఈ క్రమంలోనే సజ్జనార్‌ (Sajjanar )ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ విషయంపై దృష్టి పెట్టారు. జీతాలపై ఆయా బ్యాంకులతో ( Banks ) చర్చించారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌ డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొచ్చి.. అక్టోబర్‌ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. టికెట్ల ఆదాయం నుంచి గానీ, ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచిగానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకు చెల్లించనున్నారు.

     ఇది చదవండి :  బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. విడుదల చేయించాలని అమిత్ షాకు లేఖ


    ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ కార్మికులకు, ఉద్యోగులకు ముందుగానే దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు వారికి కృతజ్ఝతలు కూడా తెలిపారు. కరోనా కాలంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి నిబద్దతతో పని చేశారని తెలిపారు. ఇక నుండి జీతాలు ఒకటో తారీఖున జీతాలు అందుతాయని , ఇందుకు అనుగుణంగానే కార్మికులు కూడా నిబద్దత ,భాద్యతతో పాటు క్రమశిక్షణ, రెట్టించిన ఉత్సహాంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Telangana, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు