సమ్మె విరమణపై తేల్చుకోలేకపోతున్న ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్‌లోని పలు ఫంక్షన్ హాల్స్‌లో యూనియన్ల వారీగా సమావేశమైన కార్మికులు... సమ్మె విరమణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 4:48 PM IST
సమ్మె విరమణపై తేల్చుకోలేకపోతున్న ఆర్టీసీ కార్మికులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Rtc employees divided over call off tsrtc strike ak
సమ్మె విరమణపై తేల్చుకోలేకపోతున్న ఆర్టీసీ కార్మికులు
సమ్మె విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు హైదరాబాద్‌లో సమావేశమైన ఆర్టీసీ కార్మికులు... ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నగరంలోని పలు ఫంక్షన్ హాల్స్‌లో యూనియన్ల వారీగా సమావేశమైన కార్మికులు... ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 46 రోజుల పాటు సమ్మె చేసి... ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకుండా విరమిస్తే ఎలా అని పలువురు కార్మికులు తమ వాదన వినిపించారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామని... మరోసారి సమ్మె చేసే అవకాశం కూడా ఉండదని అన్నారు.

అయితే ఇప్పటికే ఆర్థికంగా ఆర్టీసీ కార్మికులు చితికిపోయారని... సమ్మె అంశం లేబర్ కోర్టుకు చేరడంతో... ఇంకా సమ్మె కొనసాగించడం సరికాదని మరికొందరు అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీలోని అంశాలను కార్మికులకు వివరించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అన్ని డిపోలకు సంబంధించిన కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాత సమ్మె విరమణ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి.


First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...