హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS RTC : ఆ జిల్లాలో కార్గో సర్వీసులతో ఆర్టీసీకి 6.87 కోట్ల ఆదాయం .. ఎన్ని రోజుల్లో అంటే

TS RTC : ఆ జిల్లాలో కార్గో సర్వీసులతో ఆర్టీసీకి 6.87 కోట్ల ఆదాయం .. ఎన్ని రోజుల్లో అంటే

ts rtc cargo services

ts rtc cargo services

TS RTC: తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు ఇక దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా వస్తువులను పంపించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సేవలు విస్తరించాయి. రైల్వే శాఖ ఒప్పందంతో మిగతా రాష్ట్రాల్లోని విస్తరిస్తూ దేశవ్యాప్తంగా సేవలను పొందేందుకు సదావకాశం ఏర్పడింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  ఇప్పటివరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు వస్తువులు చేరేవేస్తూ వస్తున్న ఆర్టీసి కార్గో(RTC Cargo)ఇకపై తమ సేవలను ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేస్తోంది. రైల్వే(Railway)తో ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశంలో ఎక్కడికైనా వస్తువులను చేరవేసే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. ఆర్టీసీ చేపట్టిన అంతర్‌ రాష్ట్ర కార్గొ సర్వీసులు మహబూబ్‌నగర్(Mahabubnagar) రీజియన్‌లో ఆదాయం పెంచుకుంది. సంస్థ కొత్త అవకాశాల ద్వారా ఆదాయం మరింత పెంచుకునే మార్గంపై దృష్టి పెడుతుంది.

  Telangana : గ్రామస్తుల చేతుల్లో మీ సేవా కేంద్రం ధ్వంసం .. నిర్వాహకుడి ఘనకార్యం వల్లే

  దినదినాభివృద్ధి..

  తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు ఇక దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు పార్టీలు వస్తువులు ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సేవలు విస్తరించాయి. రైల్వే శాఖ ఒప్పందంతో మిగతా రాష్ట్రాల్లోని విస్తరిస్తూ దేశవ్యాప్తంగా సేవలను పొందేందుకు సదావకాశం ఏర్పడింది. ఇప్పటికే ఆర్టీసీ కార్గో నుంచి లాజిక్ స్టిక్స్‌గా పేరు మార్చిన సంస్థ సేవల్లోని కొత్తదనం చూడడానికి ప్రయత్నిస్తుంది.

  కోట్లలో ఆదాయం...

  ఈ ఆర్టీసీ కార్గొ సర్వీసుల ద్వారా 2020 జూన్ 19న ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించగా ఈ నెల సెప్టెంబర్ 5 నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 9 డిపోల పరిధిలో 6,78,967. పార్శీళ్లను బట్వాడా చేయడంతో రూ 6.53 కోట్లు ఆదాయం పొందింది. సరుకు రవాణా కోసం కంపెనీలు కార్గో బస్సులను బుక్ చేసుకోవడంతో మరింత ఆదాయం పొందుతుంది. మొత్తం 359 రీజియన్స్‌కు అదనంగా రూ.33.28.213. ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ 6.87 కోట్ల ఆదాయం సంస్థకు చేరింది. తెలంగాణలో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ డిపో నుంచే 2.07 లక్షలకు పైగా పార్శిళ్లలను చేరవేయడంతో రూ 1.91 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.తర్వాత స్థానంలో గద్వాల డిపో 1.33 లక్షల పార్సిల్ బట్వాడతో రూ 1.54 కోట్ల అర్జించింది. అతి తక్కువ అచ్చంపేట డిపో నుంచి రూ.27.62 లక్షల ఆదాయం వచ్చింది.

  Telangana politics: పటాన్‌చెరు టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు .. నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికో ..?

  సేవలు విస్తృతం..

  ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రజా రవాణా తో పాటు గత రెండేళ్లుగా సరుకులు పార్శిళ్ల ద్వారా మరింత తోడ్పాడు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తృతం చేసేందుకు యజమాన్యం కృషి చేస్తుందన్నారు. రైల్వే శాఖతో ఒప్పందం ద్వారా కొన్ని రాష్ట్రాల సేవలు ప్రారంభం అయ్యాయని ఇంటింటికి పార్టీలు అందించేందుకు డోర్ డెలివరీ విధానం ప్రస్తుతం హైదరాబాదులో అమల్లోకి వచ్చింది త్వరలో జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో ఈ అవకాశం ఈ విధానం అమ్మలకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

  డిపోల వారిగా ఆదాయం..

  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో జూన్ 2020 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఐదు డిపోల వారీగా ఆదాయం ఈవిధంగా ఉంది. మహబూబ్‌నగర్ పార్శిళ్ల సంఖ్య 2,07,897 ఆదాయం కోటి 91లక్షల 53వేల 050 రూపాయలు. గద్వాల్ డిపో నుంచి 1,33,135, పార్శిళ్లు చేరవేసింది. ఆదాయం 1,54,83,680 రూపాయలుగా ఉంది. ఇక వనపర్తి డిపో .71.744. పార్శిళ్లు బట్వాడా చేశారు. ఆదాయం 58,49,223 వచ్చింది. నాగర్‌కర్నూలు డిపో 61,687పార్శిళ్లు చేరవేయగా 51,10,269 ఆదాయం వచ్చింది. ఇక షాదనాగర్.40,635 ఆదాయం 49,73,341 వచ్చింది. కల్వకుర్తి డిపో 46,618 కొరియర్స్ సప్లై చేస్తే 43.45.233 ఆదాయం వచ్చింది. నారాయణపేట డిపో .50.790 పార్శిళ్లకు గాను 42,89,237 ...కొల్లపూర్ 34,672 పార్శిళ్లకు 34,23,765 ఆదాయం వచ్చింది. అచ్చంపేట డిపో 31,789 పార్శిళ్లు చేరవేస్తే కేవలం 27,62,851 డబ్బు వచ్చింది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Telangana News, Tsrtc

  ఉత్తమ కథలు