హోటల్‌లో టీ తాగుతుండగా దారుణం.. ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే..

ప్రతీకాత్మక చిత్రం

అప్పటివరకు ప్రయాణికులతో గడిపిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఓ దాభాలో టీ తాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Share this:
    మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అప్పటివరకు ప్రయాణికులతో గడిపిన ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా గుండెపోటుతో ప్రాణాలోదిలాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ01 జడ్ 0056)ను వహీద్ అనే డ్రైవర్ ప్రయాణికులతో నిర్మల్ నుంచి కిన్వట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నేరడిగొండ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బస్సు టైర్ పంక్చరయ్యింది. దాంతో డ్రైవర్ బస్సును సమీపంలోని పంక్చర్ దుకాణం వద్ద ఆపి టైర్‌కు రిపేర్ చేయిస్తున్నాడు. పక్కనే ఉన్న ఓ ధాబాలో ప్రయాణికులతో కలిసి టీ తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగి వాంతులు చేసుకుంటూ ఒక్కసారిగా మంచంలో కుప్పకులిపోయాడు. వెంటనే ప్రయాణికులు, కండక్టర్ స్థానిక ఆర్ఎంపీని తీసుకొచ్చి వైద్యం చేయించగా, గుండెలో ఏలాంటి చలనం లేదు. దీంతో అంబులెన్స్‌లో బోథ్ ఆస్పత్రికి తరలించగా, వహీద్ గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. బస్సు నడిపేసమయంలో గుండెపోటు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగిఉండేదని ప్రయాణికులుతెలిపారు. మ‌ృతుడు వహీద్‌కు భార్య, ఇధ్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
    Published by:Narsimha Badhini
    First published: