హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై సస్పెన్స్... నేడు కరీంనగర్ బంద్?

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై సస్పెన్స్... నేడు కరీంనగర్ బంద్?

RTC Strike 28th Day : ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. ఎంతలా అంటే... డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా నిరసన చేస్తున్నారు. సమ్మెపై కార్మికులు ఇంత పట్టుదలతో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

  RTC Strike 28th Day : మన తెలుగు ఆచారాల్లో... ఎవరైనా చనిపోతే... ఒక రోజులోపే అంత్యక్రియలు జరిపేస్తాం. కరీంనగర్ 2 డిపో డ్రైవర్ ఎన్.బాబు విషయంలో అలా జరగట్లేదు. కారణం ఆర్టీసీ కార్మికుల సమ్మె. హైదరాబాద్‌లో జరిగిన సకల జనుల సమరభేరి సభకు బుధవారం హాజరై గుండెపోటుతో చనిపోయారు బాబు. ఆయన మృతదేహం గురువారం కరీంనగర్‌కు చేరుకుంది. ఆ టైంలో అఖిలపక్షాలు బంద్‌కు పిలుపిచ్చాయి. ఆర్టీసీ కార్మికులకు అఖిలపక్షాలు అండగా నిలిచాయి. దాంతో... ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేది లేదంటూ... కార్మికులు రాత్రంతా అక్కడే కూర్చున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మృతదేహాన్ని తరలిస్తే తామూ ఆత్మహత్య చేసుకుంటామని బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ కరీంనగర్ బంద్‌కు పిలుపివ్వడంతో... ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం ఉంది.

  ప్రభుత్వం మాత్రం చర్చలపై నిర్ణయం మార్చుకుంటున్నట్లు కనిపించట్లేదు. సమ్మెకు దిగినవారంతా... ఉద్యోగాలు కోల్పోయినట్లేనని సీఎం కేసీఆర్ చెప్పడంతో... సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఇప్పటివరకూ సమ్మె వల్ల 17 మంది చనిపోయినట్లు అనధికారిక లెక్కలున్నాయి. మృతదేహానికి అంత్యక్రియలు కూడా జరపకుండా సమ్మె చేస్తున్నారంటే... కార్మికులు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ సమ్మెకు మద్దతిస్తున్నాయి.

  ఆర్టీసీ కార్మికుల ఆఖరి చావు ఇదే కావాలంటూ... ఇవాళ కరీంనగర్ బంద్ చేపట్టడంతో... అక్కడ షాపుల్ని స్వచ్ఛందంగా మూసివేశారు. ఐతే... పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచీ తరలించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే... ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు బాబు కుటుంబ సభ్యులు. మరి ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా లేక... బలవంతంగా మృతదేహాన్ని తరలిస్తుందా అన్నది అంచనా వెయ్యలేని పరిస్థితి.

  Pics : అందాల తెలుగు భామ శ్రీదివ్యను చూసి తీరాల్సిందే

  ఇవి కూడా చదవండి :

  పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న టీడీపీ... వైసీపీ టార్గెట్‌గా ప్లాన్ C అమలు

  నేడు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం... ఏంటి దాని ప్రత్యేకత?

  జగన్ కోర్టుకు వెళ్తారా... లేదా? నేడు తేల్చనున్న సీబీఐ కోర్టు

  Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

  First published:

  Tags: Telangana News, Telangana updates, TSRTC Strike

  ఉత్తమ కథలు