హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ కార్గో బస్ రెడీ.. ఆ ఫోటో ఇదే..!

ఆర్టీసీ కార్గో బస్ రెడీ.. ఆ ఫోటో ఇదే..!

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సేవలకు తెలంగాణ కార్గో అండ్ పార్సిల్ అని నామకరణం చేసింది కూడా. జనవరి 1 నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇంకా చదవండి ...

  ఆర్టీసీ కార్గో (2)

  ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సేవలకు తెలంగాణ కార్గో అండ్ పార్సిల్ అని నామకరణం చేసింది కూడా. జనవరి 1 నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత 50 బస్సులతో కార్గోసేవలను అందించనుంది ఆర్టీసీ. ఆ తర్వాత విడతల వారీగా 600 నుంచి 800 బస్సులను అందుబాటులోకి తేనుంది. గత వారమే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సూచనల మేరకు ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, అందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఈడీలకు సూచించారు. ఇదిలా ఉండగా, కార్గో బస్ రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఒక మోడల్ బస్సు మియపూర్ ఆర్టీసీ బాడీ యూనిట్‌లో సిద్ధమైంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

  ఆర్టీసీ కార్గో (1)

  కాగా, ప్రస్తుతం రవాణా వ్యవస్థలో కార్గో సేవలు(సరుకు రవాణా) తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి భారతీయ తపాలా శాఖ సేవలు అందిస్తున్నా.. కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో కార్గో సేవలను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల లాభాలను గడించవచ్చని ఆయన భావిస్తున్నారు. సింగరేణి తరహాలో ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించగా.. ఆ దిశగా కార్గో సేవలు పేరుతో కొత్త దారులు తెరిచారు.

  ఇది కూడా చూడండి :

  First published:

  Tags: CM KCR, Rtc, Telangana News, Tsrtc

  ఉత్తమ కథలు