పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి మండలం అడవి శ్రీరాంపూర్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. సింగిల్ రోడ్‌పై డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో.. అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 60మంది విద్యార్థులే కావడం గమనార్హం.ప్రమాదం గురించి తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, RTC Strike, Telangana