హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS RTC | Humanity : అదృష్టం లేడీ కండక్టర్ రూపంలో ఎదురైంది .. ఆమె చేసింది చెబితే ఆశ్చర్యపోతారు

TS RTC | Humanity : అదృష్టం లేడీ కండక్టర్ రూపంలో ఎదురైంది .. ఆమె చేసింది చెబితే ఆశ్చర్యపోతారు

(Conductor Humanity)

(Conductor Humanity)

TS RTC | Humanity : అవసరానికి సాయం చేసే వాళ్లే కరువైన ఈ రోజుల్లో కేవలం ఎదుటి వాళ్ల కష్టం, బాధలను గుర్తు చేసుకొని సాయం చేయడం గొప్ప విషయం. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడం అనేది ఎంతో అభినందించాల్సిన విషయం. ఓ లేడి కండక్టర్ చేసింది అలాంటి ఉపకారమే.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సందర్భాల్లో ఎన్నో మర్చిపోవడం అలవాటు. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం సహజం. కాని ఏదైనా ఒక్కసారి మన చేయి జారిపోతే తిరిగి వస్తుందనే నమ్మకం ఉండదు. వస్తువు అయినా, డబ్బులు అయినా లేక ఇంకా ఏ ఇతర ఖరీదైన పరికరమైన పోగొట్టుకున్న వ్యక్తి దగ్గరకు చేరడం సాధ్యమయ్యే పని కాదు. కాని మంచిర్యాల(Mancherial)జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC BUS)లో ఓ మహిళా ప్రయాణికురాలికి మాత్రం ఇందుకు రివర్స్‌ జరిగింది.

Telangana : అమ్మ మందలించినందుకే మరణశిక్ష .. ఏమి కొడుకు సామిప్రయాణికురాలి సొమ్ము భద్రం..

మంచిర్యాల జిల్లాలో ఆదివారం ఉదయం 6.00 గంటలకు కోరుట్ల- మంచిర్యాల దారిలో నడిచే కొరుట్ల బస్ స్టాండ్‌లోని మంచిర్యాల బస్ ఎక్కింది ఓ మహిళా ప్రయాణికురాలు. పొలాస వెళ్లేందుకు లేడీ కండక్టర్ సరిత కూర్చున్న సీటు వెనుక సీట్లో కూర్చింది మహిళా ప్రయాణికురాలు. బస్సు ఎక్కిన తర్వాత తనకు వేరే ఫోన్‌ రావడంతో వెంటనే చేతిలోని బ్యాగ్‌ బస్సు సీట్‌లో ఉంచి వేరే బస్సు ఎక్కి వెళ్లిపోయింది. బస్సులో డబ్బుల సంచి మర్చిపోయినట్లు తెలుసుకున్న ప్రయాణికురాలు కోరుట్ల నియోజకవర్గంలోని గంబీర్ పూర్‌కు చెందిన వెంకటమ్మ వెంటనే డ్యూటీలో ఉన్న కంట్రోలర్‌ కిషన్‌రావుకు చెప్పగానే లేడీ కండక్టర్‌కు ఫోన్ చేశారు.

కండక్టర్ సేవా గుణం..

బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఫోన్‌ రావడంతో లేడీ కండక్టర్ సరిత ఫోన్ లిఫ్ట్ చేసి బస్సులో వెంకటమ్మ మర్చిపోయిన బ్యాగును జాగ్రత్త పరిచింది. బ్యాగులో 50వేల రూపాయల క్యాష్‌తో పాటు ఆధార్‌ కార్డు ఉండటంతో భద్రపరిచింది. అప్పటికే బస్సు కోరుట్ల సాయిబాబా మందిరం వరకు చేరుకుంది. ఆధార్‌ కార్డులో ప్రయాణికురాలి పేరు, వివరాలు ఉండటంతో సమాచారం అందించి..బస్సును అదే స్టాప్‌లో ఉంచి బ్యాగులో ఉన్న 50వేల రూపాయల క్యాష్, ఆధార్‌ కార్డును వెంకటమ్మకు అందజేసింది. బస్సులో మర్చిపోయిన సొమ్మును తిరిగి తనకు అప్పగించిన లేడీ కండక్టర్ సరితకు వెంకటమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

Telangana | TRS : కారు గుర్తు పార్టీలో కుమ్ములాటలు.. ఛైర్మన్లు వర్సెస్‌ కౌన్సిలర్లుప్రశంసల వెల్లువ..

ఓ ప్రయాణికురాలి సొమ్ము, వస్తువులను భద్రపరిచి తిరిగి వాళ్లకు అందజేసిన కండక్టర్ సరితను డ్యూటీలో ఉన్న కంట్రోలర్‌ను మంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో మేనేజర్, ట్రాఫిక్ సూపపరిడెంట్‌లతో పాటు బస్ ప్రయాణికులు అభినందించారు. రోడ్డు రవాణా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెంచే విధంగా ఆర్టీసీ ఉద్యోగులు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. లేడీ కండ్టర్ మాత్రం మంచి వాళ్లకు మంచే జరుగుతుందని..తాను మాత్రం ఓ ఆర్టీసీ ఉద్యోగిగా ప్రయాణికురాలి వస్తువుల్ని తిరిగి భధ్రంగా అప్పగించానని చెప్పడం విశేషం.

First published:

Tags: Manchirala, Telangana News

ఉత్తమ కథలు