హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం... వాగులో పడ్డ బస్సు

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం... వాగులో పడ్డ బస్సు

వాగులో పడిపోతున్న బస్సు

వాగులో పడిపోతున్న బస్సు

ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లను ప్రభుత్వం నియమించింది. దీంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో దుందుభి వాగు సమీపంలో బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట్ దుందుభి వాగు వద్ద ప్రైవేట్ ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. దుందుభి వాగు సమీపంలో బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్ల డటంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సులో నుంచి  దిగేశారు. దింతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి - కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఒక పక్క తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లతో బస్సులను నడుపుతున్న ప్రభుత్వ హయాంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమ్మెపై ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Rtc, Telangana, Tsrtc, TSRTC Strike

ఉత్తమ కథలు