కులాలు, మతాలతో సంబంధం లేకుండా దేశంలో ఉన్న 130 కోట్ల మంది హిందువులేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో ఉన్నవారందర్నీ ఆరెస్సెస్ హిందువులుగానే పరిగణిస్తుందని చెప్పారు. ఐక్యతతో మెలగాలన్న కాంక్షతో సంఘ్ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్లో జరిగిన ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరానికి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. ఈ సందర్భంగా.. RSS కార్యకర్తలు ప్రపంచ విజయాన్ని కోరుకుంటారని, వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించరని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఊరుకుంటే ఏ పనులూ కావన్న ఆయన.. సమాజంలో పరివర్తన వస్తేనే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పారు. '' స్వార్థం కోసం కొందరు ఇతరులను భయపెట్టి పైకి వస్తారు. అలాంటి వారు దేశానికి చాలా ప్రమాదకరం. ఎప్పుడూ వినాశనం గురించి ఆలోచించడం, ఎదుటి వారి వినాశనాన్ని కోరుకోవడం అణ్వాయధమంత ప్రమాదకరం. కొందరు ఏవేవో ఊహించుకొని విద్వేషాలురెచ్చగొడుతున్నారు. దుఖాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రపంచాన్నికూడా దుఖంతో నింపేయాలనుకోవడం చూస్తున్నాం. నీతి, న్యాయం, ధర్మం వంటి విలువలపై సానుకూల ఆలోచనా దృక్పథం లేకపోవడం సమాజానికి మంచిది కాదు.అని ఆయన అన్నారు.

ఆర్ఎస్ఎస్ మీటింగ్లో బీజేపీ నేతలు
రాజ్యాలు, వైభవాలు, మోక్షం కోరుకోని వాళ్లు ధర్మ విజయం సాధిస్తారన్నారన్న మోహన్ భగవత్.. ధర్మ విజయంలో అందరి విజయం ఉంటుందని చెప్పారు. సరూర్నగర్లో జరిగిన ఈ సభకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ఎస్ఎస్ సార్వజనిక సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ అధికారిక ప్రతినిధి మురళీధర్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

సరూర్ నగర్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్
ఇది కూడా చూడండి :
Published by:Shiva Kumar Addula
First published:December 25, 2019, 19:04 IST