RS Praveen kumar : ప్రవీణ్ కుమార్ పార్టీ కన్‌ఫాం...త్వరలో చేరుతారని ఆ పార్టీ అధినేత వెల్లడి..!

RS Praveen kumar : ప్రవీణ్ కుమార్ పార్టీ కన్‌ఫాం.

RS Praveen kumar : ఆరేళ్ల సర్వీసు ఉండగానే పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ రాజకీయ పార్టీలో చేరనున్నట్టు ఆ పార్టీ అధినేత స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయ జీవితంపై ఓ క్లారిటి వచ్చింది.

  • Share this:
    ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లోకి ఎక్కిన గురుకులాల మాజీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితంపై ఓ క్లారిటి వచ్చింది. ఇన్నాళ్లు ఆయన చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈనేపథ్యంలోనే ఆయన త్వరలోనే బీఎస్పీలో చేరతారని యూపికి చెందిన బీఎస్పీ చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయ అరంగ్రేటానికి సన్నద్దమయినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపికి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే ఆయన రాజీనామా సమర్పించారని సమాచారం.

    ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా తర్వాత ముందుగా టీఆర్ఎస్‌లో చేరతారని విపరీతమైన ప్రచారం జరిగింది. ఎస్సీలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆయనే ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా ముమ్మరమైంది. అయితే ఈ వార్తలను ప్రవీణ్ కుమార్ ఖండించారు. తాను ముందుగా రాజకీయాల్లో రానన ప్రకటించిన ఆయన అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు. తన విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని అన్నారు.

    అయితే తాను బీఎస్పీలో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ మాత్రం స్వయంగా ప్రకటించలేదు. కాని మాయవతి నేరుగా చెప్పడం ద్వారా ఆయన తెలంగాణ రాజకీయాల్లో బీఎస్పీకి కీలకంగా మారబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా గతంలో కూడా బీఎస్పీ నుండి తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీ టికెట్ రాకపోవడంతో ప్రస్తుత మంత్రి ఐకేరెడ్డితో పాటు ఎమ్మెల్యే కోనప్పలు ఇద్దరు బీఎస్పీ నుండే టికెట్ సాధించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు..
    Published by:yveerash yveerash
    First published: