నల్గొండలోని ఎంజీ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సభ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది..కార్యకర్తలు ,ఆయన అభిమానులతో సభ ప్రాంగణం నిండిపోయింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభను ఉద్దెశించి మాట్లాడారు. సభకు రాకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని ఆయన విమర్శించారు..అయినా ..తన బిడ్డలు ఆగలేదని అన్నారు..తాను రాజీనామా చేసిన రోజే కేసు పెట్టారని,ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు..అణగారిణ వర్గాల ప్రజల బిడ్డ ప్రవీణ్ కుమార్ అని, వీళ్లందరని ప్రభుత్వం ఎలా నిలువరిస్తుందని ఆయన ప్రశ్నించారు.అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకులు సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో.. అతి త్వరలోనే ప్రగతి భవన్కు పోదామని అన్నారు.
రాష్ట్రంలో కొన్ని వర్గాలు అభివృద్దిలోకి వస్తున్నా..అణగారిన వర్గాలు మాత్రం తమ కుల వృత్తులు మాత్రమే చేసుకుంటూ బతుకుతున్నారని అన్నారు.. కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులు పెట్టి అనవసర ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు..అవన్ని పేద ప్రజలు కష్టించి కడుతున్న పన్నులతో సీఎం కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.
మరోవైపు దేశంలో 46 మందికి భారతరత్న ఇస్తే.. అందులో ఒక్కడే ఓబీసీకి చెందిన వాడు ఉండడం చాలా దుర్మార్గం అని నిలదీశాడు..దేశంతోపాటు రాష్ట్రంలో ఆధిపత్య కులాల వారే పెత్తనం కొనసాగిస్తున్నారని విమర్శించారు.. గుప్పెడు మంది ఉన్న వారికే అందలం ఎక్కించి అణగారిణ కులాలను వెనక్కి నెట్టుతున్నారని అన్నారు. అణగారిన కులాలకు అధికారం ఇవ్వకపోతే..దాన్ని గుంజుకుంటామని హెచ్చరించారు..
ఇక తాను ఆశించిన బహుజన రాజ్యం ఎలా ఉండబోతుందో ఆయన వివరించారు.. ఈ నేపథ్యంలోనే బహుజన రాజ్యంలో ఇండియా.. చైనాతో పోటి పడబోతుందని ,చిన్నపిల్లను ఎవరెస్టు ఎక్కించిన మనకు ఇది పెద్ద లెక్క కాదని అన్నారు..కల్లుగీత కార్మికులు సైతం బహుజన రాజ్యంలో కంప్యూటర్ ఇంజనీర్లుగా మారతారని అన్నారు. మాల మాదిగల బిడ్డలు డాలర్లు సంపాదించేలా తాము ఏర్పాటు చేయబోయో బహుజన రాజ్యంలో ఉంటుందని అన్నారు... దేశ సంపదలో బహుజనులకు భాగస్వామ్యం ఉందని,అందుకే వారికి రిజర్వేషన్లు ఉండాలని ఆయన డిమాండ్ చేశాడు..అయితే బహుజన రాజ్యం అంత సులువుగా రాదని అందుకోసం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఎన్నికల్లో అనేక రూపాల్లో మాయచేసి మళ్లి అధికారంలోకి వస్తారని అన్నారు. తలనరుక్కుంటామని ,కాళ్లు మొక్కుతారని అన్నారు.. అందుకే ప్రతి ఒక్కరు ఒక ప్రవీణ్ కుమార్ ,కాన్షీరాం, మాయవతి వలే మార్చాలని అన్నారు. ఓటుకు అమ్ముడుపోకుండా గొప్ప నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.