Home /News /telangana /

RS ONE LAKH LOST FOR ONE SAREE PERCHASED BY ONLINE VRY

Online fraud : ఒక చీరకు బదులు మరో చీర...ఆన్‌లైన్‌లో ఎంత మోసపోయిందా తెలుసా..?

Online fraud : ఒక చీరకు బదులు మరో చీర...ఆన్‌లైన్‌లో ఎంత మోసపోయిందా తెలుసా..?  (ప్రతీకాత్మక చిత్రం)

Online fraud : ఒక చీరకు బదులు మరో చీర...ఆన్‌లైన్‌లో ఎంత మోసపోయిందా తెలుసా..? (ప్రతీకాత్మక చిత్రం)

Online fraud : ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు కుచ్చుటోపి పెట్టారు...ప్లాన్ ప్రకారమే మహిళను ముగ్గులోకి లాగి ఆమె బ్యాంక్ వివరాలు సేకరించి..అకౌంట్‌లో నుండి లక్ష రూపాయలను కొట్టివేశారు. దీంతో సదరు మహిళ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఓ సిఐ భార్య కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంకా చదవండి ...
    రోజురోజుకు పెరుగుతున్న ఆన్‌లైన్ వ్యాపారాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఫేక్ కాల్ సెంటర్‌ నెంబర్‌ను ఇచ్చి దాని ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు..ఇలా నగరంలో పలు కేసులు బుక్‌ అయినా..వినియోగదారులు మాత్రం సైబర్ వలలో చిక్కుకుని మోసపోతున్నారు.ఇక గత కొద్ది రోజులుగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ కొనుగోళ్ల పై ఆసక్తి చూపిస్తుండడంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు..

    ఈ క్రమంలోనే తాజాగా ఓ పోలీస్ సీఐ భార్యకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ట్రాప్‌చేసి ఖాత నుండి అక్షరాల లక్ష రూపాయలు కొట్టివేశారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్, నారాయణగూడ పరిధిలో పనిచేస్తున్న సీఐ సతీష్ సతీమణి ఆన్‌లైన్‌‌లో ఓ డిజైనర్ సారీని కొనుగోలు చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా...చీరను ఆర్డర్ చేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు తమ ప్లాన్‌ను తెరతీశారు.

    దీంతో సదరు మహిళ ఆర్డరు చేసిన చీరను కాకుండా మరో క్వాలిటీ లేని డిజైనర్ సారీని పంపించారు..దీంతో ఆమె సంబంధిత ఆన్‌లైన్‌ సంస్థకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది..అయితే ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆమెను ట్రాప్‌లో పడేశారు. నంబర్‌ను గూగుల్ సెర్చ్‌లో ఆన్‌లైన్ సంస్థ యొక్క కాల్‌సెంటర్‌కు బదులుగా సైబర్ నేరగాళ్ల నెంబర్‌కు కాల్ చేసింది..దీంతో వారు చీరను వాపసు తీసుకోవడంతో పాటు డబ్బులు వెనక్కి ఇస్తామని సమాధానం చెప్పారు.

    అనంతరం డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు బ్యాంకు వివరాలు తీసుకున్నారు. దీంతో ఆమె ఆధార్‌నంబర్‌తో పాటు బ్యాంక్ పూర్తి వివరాలను చెప్పింది. ఇంకేముంది ఆమె చెప్పిన వివరాలతో బ్యాంకు ఖాతా నుండి లక్ష రూపాయలు తమ ఖాతాకు మరల్చుకున్నారు. ఆ వెంటనే ఖాతా నుండి మెసెజ్ రావడంతో అలర్ట్ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    మొత్తం మీద ఆన్‌లైన్ వ్యాపారలతో పాటు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొందని పోలీసులు పదేపదే చెబుతున్న అదే డిపార్ట్‌మెంట్‌కు చెందని వారు కూడా పెడచెవిన పెట్టడడంతో ఇలాంటీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి..దీంతో ప్రజలు కాల్‌సెంటర్ నెంబర్‌లతో పాటు ఇతర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని కొరుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Hyderabad crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు