హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber Crime: ఫ్లైట్ టికెట్ కోసం ఓటీపీ చెప్పాడు.. తర్వాత తన బ్యాంక్ అకౌంట్ చూసుకొని షాక్ తిన్నాడు.. ఏం జరిగిందంటే..

Cyber Crime: ఫ్లైట్ టికెట్ కోసం ఓటీపీ చెప్పాడు.. తర్వాత తన బ్యాంక్ అకౌంట్ చూసుకొని షాక్ తిన్నాడు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cyber Crime: ఆర్మీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.98 వేలు డ్రా అయ్యాయి. ఢిల్లీకి విమాన టికెట్ బుక్ చేస్తున్న క్రమంలో అపరిచిత వ్యక్తి ఫోన్ చేయగా.. అతడికి బ్యాంక్ వివరాలు చెప్పడంతో మోసం జరిగినట్లు గ్రహించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

ఓ వైపు కరోనాతో సామాన్యుడు ఇబ్బందులకు గురవుతుంటే.. మరో వైపు కేటుగాళ్లు వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రతీ రోజు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. అపరిచిత వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పకూడదంటూ అధికారులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. దీనినే వారు ఆసరాగా మర్చుకొని ఏంచక్కా అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ ద్వారా విమాన ప్రయాణ టికెట్ కొనుగోలు చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. దాని కోసం ఓ యాప్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా రూ.6 వేలు చెల్లించాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి ప్రయాణ టికెట్ ప్రాసెస్ కోసం మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడగడంతో అతడు చెప్పాడు. వెంటనే తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని హన్వాడ మండలం నైనోనిపల్లీ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సెలవుల మీద ఇంటికి వచ్చాడు. తిరిగి విధుల్లోకి చేరేందుకు ఆన్ లైన్ ద్వారా ఢిల్లీకి విమాన టికెట్ బుక్ చేసుకునేందుకు ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులో ప్రాథమిక సమాచారం ఎంటర్ చేసి రూ.6 వేలను చెల్లించారు. అనంతరం ఓవ్యక్తి ఫోన్ చేసి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నందుకు మీ ఫోన్ కి ఓటీపీ నెంబర్ వస్తుందని.. ఆ తర్వాత తదుపరి ప్రాసెస్ అవతుందని తెలిపాడు. దానికి కోసం మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలని అని అడిగారు.

శ్రీనివాస్ తన ఫోనుకు వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పిన పదినిమిషాల తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి రూ.98 వేలు డ్రా చేసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించి స్థానిక మండలం హన్వాడ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఆన్ లైన్ మోసాలు ప్రతీ నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నావని వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime, CYBER CRIME, Cyberabad, Mahabubnagar

ఉత్తమ కథలు