Home /News /telangana /

RS 5000 CR FOR SEWAGE PLANTS AND WATER SUPPLY IN HYDERABAD GO RELEASED VRY

ktr : హైదరాబాద్‌లో సీవరేజ్ ప్లాంట్స్, మంచినీటికి 5000 కోట్లు.. జీవో విడుదల

KTR (File photo )

KTR (File photo )

ktr : రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజ్ ప్లాంట్ల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామ‌ని, సీవ‌రేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించింది అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిందని ఆయన చెప్పారు.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్‌ను (hyderabad) విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా నగరం ఎదుర్కొంటున్న మురికి నీరు శుద్దికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం(State govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను(sewage plant) నిర్మించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

    ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ (ktr) పలు అంశాలను వివరించారు. ఈఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న అని చెప్పారు. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా ఎద‌గాలంటే మౌలిక వ‌స‌తులు ఉండాలని ఆయన పేర్కొన్నారు... ఇందుకు అనుగుణంగా ఏడు సంవ‌త్స‌రాలుగా జీహెచ్ఎంసీ, (ghmc)రాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిందని తెలిపారు.. ఇందులో భాగంగానే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో తాగునీటికి స‌మ‌స్య(drinking water) లేకుండా చేశామని చెప్పారు... నగరంలో తాగునీటి స‌మ‌స్య‌ దాదాపు 90 శాతం పూర్తయిందని అన్నారు. ఇక ఎల‌క్ట్రిసిటీ విష‌యంలో కూడా స‌మ‌స్య‌ల్లేవని చెప్పిన ఆయన ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామని చెప్పారు. హైద‌రాబాద్ వాట‌ర్ ప్ల‌స్ సిటీగా కూడా గుర్తింపు లభించందని చెప్పారు.

    ఇది చదవండి :   మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !

    ఇందులో బాగంగానే హైదరబాద్ రింగ్ రోడ్డు(ring road) ప‌రిధిలో రోజుకు 1950 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్ప‌త్తి అవుతుండగా ఒక జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1650 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్ప‌త్తి అవుతోందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి మూసీ ప్ర‌క్షాళ‌న‌, చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ గురించి సీఎం కేసీఆర్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లడంతో సీం కేసీఆర్ దీనిపై చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందులో బాగాంగానే కేబినెట్ స‌మావేశంలోనూ (cabinet meeting ) ఈ అంశంపై విస్తృత చ‌ర్చ జ‌రిగిందని ఆయన చెప్పారు. రాబోయే ప‌దేళ్ల ( ten years) అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న 772 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల‌కు అద‌నంగా 1260 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమ‌తి ఇచ్చిందని, దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని మంత్రి కేటిఆర్ చెప్పారు. దీని ద్వారా నగరంలోని 31 ప్రాంతాల్లో ఈ సీవ‌రేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్ కు(cm kcr) మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

    ఇది చదవండి : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ


    దీంతో పాటు హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఉండే ప్ర‌జ‌ల‌కు మంచి నీటి నిర్వహణ కోసం రూ. 1200 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. మురుగు నీరు శుద్ధి, మంచినీటి కోసం ఒకే రోజులో రూ. 5000 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం గొప్ప విషయమన్నారు. రెండేళ్లలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని ఆయన వివరించారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, KTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు