corona : 45 లక్షలు ఖర్చు,అయినా... నిలవని ప్రాణం... కరోనాతో విలవిలలాడుతున్న కుటుంబం..

45 లక్షలు ఖర్చు,అయినా... నిలవని ప్రాణం... కరోనాతో విలవిలలాడుతున్న కుటుంబం

corona : కరోనాకు ఎన్నో రకాల మందులు వచ్చినా ప్రాణాలు మాత్రం నిలవడం లేదు..లక్షల ఖర్చుతో ఆసుపత్రుల చుట్టు తిరగినా ప్రయోజం లేకుండా పోతుంది..దీంతో కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు వదిలి రోడ్డు మీద పడుతున్నారు.

  • Share this:
కరోనా కల్లోలం అనేక మంది బ్రతులకు చిద్రం చేస్తోంది.. జీవితంలో తమ కళలను సాకారం చేసుకుని, స్థిర పడిన కుటుంబాలనే కాకుండా, మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది..ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోలేక అనేక మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు..అయితే కొంతమంది తమ ప్రాణాల కోసం లక్షల రూపాయలు అప్పులు తెవడం లేదా ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నారు..అయినా వారి ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేకుండా పోతుంది.

ఇలాంటీ నేపథ్యంలోనే వరంగల్‌లోని ఓ కుటుంబం కరోనాతో చిద్రం అయింది..ఒకే ఇంట్లో కుటుంబ యజామానితో పాటు భార్య పిల్లలతో పాటు, తల్లిదండ్రులు కూడ కరోనా సోకడంతో ఏకంగా ఆస్తులు అమ్మి 46 లక్షల రుపాయాలు ఖర్చు చేసిన ప్రాణం దక్కలేదు..వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజన్‌బాబు ఉపాధి కోసం హైదరాబాద్ కూకట్‌పల్లిలో జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇటివలే రాజన్‌బా‌బుతో పాటు భార్య, ఇద్దరు కుమారులకు కరోనా సోకింది..దీంతో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు..అయితే రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకున్నాడు...అక్కడ నుండి మియాపూర్, సాగర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులు తిరుగుతూ ..రోజుకు లక్షల రుపాయాలు వెచ్చించాడు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో చివరికి ఈఎస్ఐకి చేరి చికిత్స పోందారు..అయితే అక్కడ చికిత్స పొందుతూ..ప్రాణాలు కొల్పోయాడు. మొత్తం మీద తన ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని కలిపి 46 లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వాపోయారు..మరోవైపు భార్య పిల్లలు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు.. విషాదం ఏమిటంటే ఇటివలే.. కరోనాతో రాజన్ బాబు తల్లి ,సోదరి కూడ కరోనా సోకి చనిపోయారు..దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాతో చనిపోవడం గ్రామంలో విషాదం చేటుసేసుకుంది.
Published by:yveerash yveerash
First published: