• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • RS 20 THOSAND FINE TO GOVT TEACHER FOR CUTTING TREE WITH OUT PERMISSION IN SIDDIPET VRY MDK

Tree cutting : బాధ్యత మరిచిన ప్రభుత్వ టీచర్..20 వేల జరిమాన

చెట్టు కొట్టినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 20వేల జరిమానా.. సిద్దిపేటలో అంతే మరి

Tree cutting : హరిత హారం తర్వాత ఏ జిల్లాలో అయినా చెట్ల పెంపకంపై సామాజిక అవగాహన పెరిగింది..దీంతో చెట్ల పెంపకం తప్ప వాటిని తుంచివేయడంపై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు..దీంతో చెట్లు నరికిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.

  • Share this:
హరిత హారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే..రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటుతూ, వాటి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారు.. మరోవైపు పెద్ద ఎత్తున క్యాంపేయిన్ చేస్తూ..ప్రతి సంవత్సరం లక్షల చెట్లను పలు జిల్లాల్లో నాటుతున్నారు.. అయితే వీటిని కొంతమంది తమ స్వార్థం కోసం, ప్రభుత్వ అనుమతి లేకుండా అనవసరంగా నరికి వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని గుర్తింపు తెచ్చుకున్న జిల్లా అయినప్పటికి హరితహారం పథకం క్రింద 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా ఇటివల నరికివేశారు.

చెట్టు నరికివేత పై స్థానిక అధికారులు ఆయనపై సిద్దిపేట కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
గవర్నమెంట్ టీచర్ చేసిన పనిపై నగర మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరికిన చెట్టుకు బదులుగా ఆయనకు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. పర్యావరణ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు గానూ టీచర్ మరో 50 చెట్లు నాటాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లడుతూ.. సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా ఇలా చేయడం తగదని వ్యాఖ్యానించారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది వారే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
Published by:yveerash yveerash
First published: