సీరియస్ యాక్షన్...చెట్లను నరికిన రియల్ సంస్థకు రూ20 లక్షలు జరిమానా...!

సీరియస్ యాక్షన్...చెట్లను నరికిన రియల్ సంస్థకు రూ20 లక్షలు జరిమానా...!

cutting trees

అనుమతి లేకుండా చెట్లను నరికిన రియల్ వ్యాపారులకు తెలంగాణ అటవిశాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.ఓ రియల్ వ్యాపార సంస్థలకు రూ.20 లక్షల జరిమాన విధించారు,

 • Share this:
  అనుమతి లేకుండా చెట్లను నరికిన రియల్ వ్యాపారులకు తెలంగాణ అటవిశాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రియల్ వెంచర్‌లో చెట్లును నరికారన్న సమాచారం అందుకున్న అటవిశాఖ అధికారులు వెంచర్‌ను పరీశీలించి రియల్ వ్యాపారికి రూ 20 లక్షల జరిమానా విధించారు. దీంతో పాటు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు వారిచేత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారిపై వాల్టా చట్టం ప్రకారం కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. కాగ సంఘటన మేడ్చెల్ జిల్లా కీసర మండలం బొమ్మరాసిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది.

  తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హరం ద్వార చెట్లను నాటుతుంటే..మరోవైపు రియల్ వ్యాపారులు తమ ఇష్టాను సారం చెట్లను నరుకుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా వందలాది చెట్లను ఎలాంటీ అనుమతులు లేకుండా కూకటి వేళ్లతో పీకి వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన హరిత హరం కార్యక్రమానికి అర్థం లేకుండా పోతుంది.. ఓవైపు వర్షాకాలంలో కో్ట్ల కొద్ది మొక్కలను నాటుతుండడంతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దారు. దీంతో ఉన్నతస్థాయి వర్గాల నుండి సామాన్య ప్రజలు కూడ ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు.

  ఇదంతా ఓ వైపు జరుగుతుంటే మరోవైపు రియల్ వ్యాపారులతో పాటు వ్యక్తిగతంగా మరికొంత మంది చట్టాలపై అవగాహాన లేక తమ స్వంత భూముల్లో ఉన్న చెట్లను నరుకుతున్నారు. దీంతో రోజు వందలాది చెట్లు నేలకొరుగుతన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇష్టానుసారంగా చెట్లను నరికిన గ్రీన్ లీఫ్ వెంచర్స్ అనే ఓ రియల్ సంస్థకు అటవీశాఖ అధికారులు భారీగానే జరిమాన విధించారు. ఇటివల సంస్థ తన వెంచర్ ను వేస్తున్న సంధర్భంలో స్థలంలో ఉన్న వందలాది చెట్లను నరికివేశారు. దీంతో వారి నుండి 20 లక్షల రూపాయల జరిమానను అటవిశాఖ అధికారులు వసూలు చేశారు.

  సంత భూముల్లో కూడ అనుమతి తప్పని సరి

  కాగా స్వంత భూముల్లో కూడ చెట్లను నరికేటప్పుడు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో కూడ ధరఖాస్తు చేసుకోవాలని, చెట్ల నరికివేత తప్పనిసరైతే అనుమతులు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యతను బట్టి అధికారులు జిల్లా , మరియు రాష్ట్ర స్థాయిలో అనుమతులు ఇస్తారని చెబుతున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  అగ్ర కథనాలు