Hyderabad Tea : హైదరాబాద్‌లో టీ బాగా కాస్లీ గురు.. కప్పు చాయ్ 1000 రూపాయలట..!

ఛాయ్ (ప్రతీకాత్మక చిత్రం)

Hyderabad Tea : టీ లేనిదే సాధారణ మనిషి జీవితం కొనసాగడం కొంచం కష్టమే.. రోజు ఆ టీ లేనిదే సగటు మానవుడు ముందుకు సాలేడు... అయితే ఆ టీ రకాల్లో వందల రకాలు ఉన్నాయి.. ఇలా రకాలే కాదు ఒక్క కప్పు టీ ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుందట.. అది కూడా హైదరాబాద్‌లోనే...

  • Share this:
    కప్పు చాయ్ రూ. 1000

    సాధారణంగా ఒకరు ఒక కప్పు టీ ( Tea )కోసం మనం ఎంత ఖర్చు పెడుతాం...? రూ 'సాధారణ టి 8 రూపాయల నుండి 10.15, 25 అంతే కదా లేదంటే ఇంకా లగ్జరీ హోటల్స్‌లో అయితే... 100 నుండి 300 రూపాయల వరకు ఉంటుంది.. ఇలా దేశంలో ఏ హోటల్‌లుకు వెళ్లినా ఇంతకంటే ఎక్కువ రేటు మాత్రం కనిపించదు.. కాని కాస్మోపాలిటన్ సిటిగా పేరుగాంచిన హైదరాబాద్‌లో ( hyderabad )మాత్రం అంత్యంత ఖరీదైన టీ అమ్మెందుకు సిద్దమైంది. ఆ చాయ్‌కి అనేక ప్రత్యేకతలు ఉండడంతో ఒక్కో కప్పు ధర 1000 రూపాయలు ఉంటుందని నిర్వహాకులు చెబుతున్నారు. కాగా ఈ టీ అమ్మెది హైదరాబాద్‌ చాయ్‌కు ఫేమ్ అయిన నిలోఫర్‌లో కావడం విశేషం..

    ఆ టీ స్పెషాలిటి ఏమిటి...

    ఆ క‌ప్పు చాయ్‌కి అంత ధరకి కారణం ఎమిటనేది నిర్వహకులు చెబుతున్నదానిని బట్టి.. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఖరీదైన ఆ టీ తయారీకి వాడే టీ పౌడ‌ర్ ధ‌ర (tea powder rate )కిలో రూ.75 వేలు ఉంది కాబట్టి కప్పు టీకి అంత ధర ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చాయ్‌లో పాలు ఉండ‌వు. దీన్ని తయారీ విధానం వేరుగా ఉంటుంది. ఈ చాయ్ మాల్టీ వాస‌న‌తో చాలా ఘుమఘుమలాడుతూ.. అద్భుతంగా ఉంటుంది. దీని పేరు గోల్డెన్ టిప్స్ బ్లాక్ టి అని దానికి పేరని నిలోఫర్‌ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు.. కాగా ఈ పౌడరుని అస్సాంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసినట్టు చెప్పారు.

    ఇది చదవండి : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికా ఫస్ట్..భారత్ సెకండ్ ప్లేస్...


    కేవలం కిలొన్నర మాత్రమే అందుబాటులో

    కాగా ఈ టీ పౌడరు కేవలం 1.5 కిలోలు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు... అయితే, కేఫ్ ఈ టీ రకాన్ని అందించడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా సేవలందిస్తోంది. అసోంలోని మైజాన్ గోల్డెన్ టిప్స్, మాల్టీ వాసనకు ప్రసిద్ధి, దేశంలో అత్యంత ఖరీదైన టీ రకాల్లో ఇదీ ఒకటి. 2019 లో, ఇది గౌహతి టీ వేలం కేంద్రంలో కిలో రూ .70,000 కి విక్రయించి రికార్డు కూడా సృష్టించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, కోల్‌కతాలో ఒక టీ విక్రేత కూడా ఒక్కో కప్పుకు రూ .1,000 చొప్పున టీ అమ్మడం ప్రారంభించాడు. ఈ రకం టీ దేశంలోనే అత్యంత ఖ‌రీదైన చాయ్‌గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ స్ఫెషల్‌ టీ మా బంజారాహిల్స్ అవుట్‌లెట్‌లో మాత్రమే లభిస్తుందని ఆయన అన్నారు.

    ఇది చదవండి : కష్టాల్లో ఉన్నాం ఆదుకోండంటూ భారత్​ను అర్థించిన శ్రీలంక.. అప్పుగా 50 కోట్ల డాలర్లు ఇవ్వాలంటూ వేడుకోలు

    Published by:yveerash yveerash
    First published: