హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli :రూ..పదికే కరోనా వైద్యం...! వృత్తి ధర్మం నిర్వహిస్తున్న ఆదర్శ వైద్యులు

Peddapalli :రూ..పదికే కరోనా వైద్యం...! వృత్తి ధర్మం నిర్వహిస్తున్న ఆదర్శ వైద్యులు

రూ..పదికే కరోనా వైద్యం...! వృత్తి ధర్మం నిర్వహిస్తున్న ఆదర్శ వైద్య జంట

రూ..పదికే కరోనా వైద్యం...! వృత్తి ధర్మం నిర్వహిస్తున్న ఆదర్శ వైద్య జంట

Peddapalli : కరోనా కష్టకాలంలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఆసుపత్రులు అనేకం వెలుగులోకి వచ్చాయి..కరోనా అంటే లక్షల రూపాయలు లేనిదే చికిత్స చేయని ఆసుపత్రులు ఉన్నాయి..చివరికి చనిపోయినా కూడ బిల్లు కట్టందే శవాన్ని ఇవ్వమని మొండికేసిన వైద్యులు ఉన్నారు..కాని అదే కరోనా కాలంలో కొంతమంది వైద్యులు మాత్రం తమ వృత్తికి న్యాయం చేస్తూ..బీదప్రజలకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు..ఇలా కరోనా పేషంట్లకు కనీస చార్జీలు లేకుండా వైద్యం అందిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోనే ఓ వైద్య జంట..

ఇంకా చదవండి ...

పెద్దపల్లి జిల్లా.

న్యూస్ 18తెలుగు. కరస్పాండెంట్ శ్రీనివాస్. పి.


ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంటే ప్రైవేట్ ఆసుపత్రుల అధిక చార్జీల దోపిడీ అంతా ఇంతా కాదు. అధిక ఛార్జీలు చెల్లించ లేక, రోగం నయం కాక రోగులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. అలాంటి వారి కోసం పెద్దపల్లి కి చెందిన  ఇద్దరు వైద్యులు కేవలం పది రూపాయల నామ మాత్ర ఫీజు తో పేదలకు వైద్యం అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు డాక్టర్ రాజు, పావని.  పై న్యూస్ 18 తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనం......

కరోనా రెండో దశ విజృంభిస్తున్న కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి,  పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన  డాక్టర్  రాజు  ఆర్తో ఫిజియన్, డాక్టర్ పావని జనరల్ ఫిజీషియన్ , ఆసుపత్రికి వచ్చే రోగులకు కేవలం పది రూపాయల నామమాత్రం పీజుతో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో  చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా ఇన్ పేషెంట్ గా అడ్మిట్ చేసుకున్న వారి వద్ద కూడా కనీస చార్జీలు మాత్రమే తీసుకుంటూ రోగులకు మేలైన చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పది రూపాయల పీజుతో వైద్య సేవలు అందిస్తున్నఈ డాక్టర్లను పలువురు అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వైద్యులు రాజు, పావని మాట్లాడుతూ.... తాము కూడా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద మధ్య తరగతి వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడటం ప్రత్యక్షంగా చూసిన క్షణంలో తమ వంతు బాధ్యతగా వారి కోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకొన్నామనీ తెలిపారు. గతంలో 300 రూపాయలు ఉన్న కన్సల్టింగ్ ఫీజును, కేవలం పది రూపాయలకు తగ్గించి ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే కరోనా రోగులతో పాటు సాదారణ రోగులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇలా చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని ప్రజల నుండి కూడా మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు.

పెద్దపల్లి పట్టణానికి చెందిన వైద్యులు కేవలం పది రూపాయల నామామాత్రం పీజుతో తమ లాంటి పేద వర్గాలకు ఈ పరిస్థితిలో వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద వారిని ఆదుకున్నందుకు రోగులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంటే  ప్రైవేట్ ఆసుపత్రుల అధిక చార్జీల దోపిడీకి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటీ డాక్టర్ల ను చూసి మిగతా డాక్టర్లు నేర్చుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ రాజు, పావని లు పది రూపాయలకే వైద్యం అందించడం పట్ల పెద్దపల్లి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోగులు కూడా పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్ రాజు రోగులకు ఉన్న సందేహాలు అన్ని తీరుస్తున్నాడని   పేషంట్లు చెబుతున్నారు

Published by:yveerash yveerash
First published:

Tags: Corona treatment, Karimangar

ఉత్తమ కథలు