KTR Birthday gift : రివర్స్ అయిన కేటిఆర్ బర్త్ డే గిఫ్ట్...రూపాయికే పెట్రోల్ అంటూ ప్రచారం ...చివరకు..?

మంత్రి కేటీఆర్ ( ఫైల్ ఫోటో )

KTR Birthday gift : మంత్రి కేటిఆర్ బర్త్ డే పిలుపు అందుకున్న ఓ నాయకుడు బుక్ అయ్యాడు.కేకులు, ప్లేక్సీలపై ఖర్చుపెట్టకుండా.. ఏదో ఒక సహాయం చేయాలన్న పిలుపుతో ముందుకు వచ్చిన ఆ నాయకుడు..వచ్చిన స్పందనను చూసి ఖంగు తిన్నాడు.. అందరికి తాను ప్రకటించిన గిఫ్టును అందించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెనక్కి తగ్గాడు.

  • Share this:
    మంత్రి కేటిఆర్ బర్త్ డే సంధర్బంగా అనవసర ఖర్చులు పెట్టకుండా ప్రజలకు,బీదవారికి ఉపయోగపడే విధంగా సహాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కేటిఆర్ సైతం వంద మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహానాలు అందించేందుకు ముందుకు వచ్చాడు. కాని వర్షంతోపాటు ఇతర కారణాల వల్ల వాటి పంపిణి వాయిదా వేశారు.

    అయితే ఆయన పిలుపును అందుకున్న పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కార్యకర్తలు, మంత్రులు , ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్పందించారు. బీద ప్రజలకు ఏదో రకంగా మేలు చేసేందుకు ముందుకు వచ్చారు. మొక్కలు నాటటడంతో పాటు చాలా మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహానాలు సైతం అక్కడక్కడ పంపిణి చేశారు.

    ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన మోటూరి మోహన్ రావు అనే నాయకుడు వినూత్నంగా ఆలోచించాడు. సాధారణంగా బీదలకు ఎదైన పంపీణి చేయాలంటే పండ్లు లేదా ఆహార పదార్థాలు ఇంకా లేదంటే..వారికి అవసరమైన ఇతర వస్తువులు పంపిణి చేస్తారు. కాని ఇందుకు విరుద్దంగా మోహన్ రావు ఆలోచించాడు. నిత్యవసర వస్తువుల్లో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌ను తాను పంపిణి చేసి మంచి పేరు కొట్టేయాలని భావించాడు. ఇందుకు అనుగుణంగానే కేటిఆర్ బర్త్ డే సంధర్బంగా రూపాయికే లీటర్ పెట్రోల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. వందలమందికి మెసెజ్ పోయింది. దీంతో వందల మంది ఒక్కసారిగా పెట్రోల్ పంపువద్ద బారులు తీరారు.

    అయితే ఏ కొద్దిమందికో పెట్రోల్ పోయిద్దామని భావించిన మోహన్ రావు పెట్రోల్ కోసం బారులు తీరిన జనాన్ని చూసి అవాక్కయ్యాడు. అందరికి పెట్రోల్ పోయించలేక తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడనుండి జారుకున్నాడు. దీంతో పెట్రోల్ కోసం వచ్చిన వారు ఆయన చేసిన పనిపై నిప్పులు గక్కుతూ తిరిగి వెళ్లిపోయారు.

    సో మొత్తం మీద పెట్రోల్ కోసం మధ్యతరగతి ప్రజలు కూడా బారులు తీరుతారనే పరిస్థితి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇదివరకు కూడా యాబై రూపాయలకే లీటర్ పెట్రోల్ ప్రకటించడంతో ఓ వ్యక్తి వందల కిలోమీటర్లు వెళ్లి పెట్రోల్ పోయించుకున్న ఘటన వైరల్ గా మారింది. తాజాగా జరిగిన సంఘటనతో పెట్రోల్ ప్రభావం సామాన్యులపై ఏమేరకు ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
    Published by:yveerash yveerash
    First published: