హోమ్ /వార్తలు /తెలంగాణ /

రైలు ఎక్కుతూ పట్టాలపై జారిపడిన పసి బాలుడు.. తర్వాత ఏం జరిగింది? వీడియో

రైలు ఎక్కుతూ పట్టాలపై జారిపడిన పసి బాలుడు.. తర్వాత ఏం జరిగింది? వీడియో

రైలు నుంచి జారిపడిన చిన్నారి

రైలు నుంచి జారిపడిన చిన్నారి

ఓ మహిళ తన కుమారుడిని చేతులతో పైకి ఎత్తి.. రైలులోకి ఎక్కించే ప్రయత్నం చేసింది. కానీ అతడు జారి పోయాడు. ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో పడిపోయాడు.

ఫ్లాట్‌ఫామ్‌పై రైలు ఆగింది. అది త్వరగా వెళ్లిపోతుందేమోన్న కంగారులో అందరూ గబాగబా రైలు ఎక్కుతున్నారు. లోకో పైలట్ హారన్ మోగించే సరికి అందరూ రైలు లోపలికి వెళ్తున్నారు. కానీ ఇంతలోనే ఓ బాలుడు తన ఓ తల్లి చేతిలో నుంచి జారిపడ్డాడు. రైలు ఎక్కుతూ కింద పడిపోయాడు. ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో ఉండిపోయాడు. హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది.? రైలు వెళ్లిపోయిందా? బాలుడు ఎలా బయటకొచ్చాడు?

బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉన్న రైలులోకి అందరూ ఎక్కుతున్నారు. ఓ ఫ్యామిలీ కూడా నాలుగేళ్ల బాలుడితో కలిసి రైలు ఎక్కేందుకు వెళ్లింది. ఓ మహిళ తన కుమారుడిని చేతులతో పైకి ఎత్తి.. రైలులోకి ఎక్కించే ప్రయత్నం చేసింది. కానీ అతడు జారి పోయాడు. ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ సీమా హుటాహుటిన పరుగెత్తికొచ్చింది. పట్టాలపై పడిపోయిన బాలుడిని పైకి తీసి.. తల్లిని అప్పగించింది. అనంతరం ఇద్దరూ రైలు లోపలికి వెళ్లిపోయారు. బాలుడికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మార్చి 9న సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన జరిగింది. ఆ సీసీ ఫుటేజీని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మహిళా కానిస్టేబుల్ చేసిన సాయాన్ని కీర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ప్రతిరోజూ హీరోలేనని కొనియాడారు.


బాలుడిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మీరు గ్రేట్ మేడమ్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సకాలంలలో స్పందించకపోయి ఉన్నా.. రైలు కదిలినా.. బాలుడి ప్రాణాలకు ముప్పు ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Hyderabad, Indian Railways, South Central Railways, Telangana

ఉత్తమ కథలు