జూపార్కులో విషాదం.. రాయల్ బెంగాల్ టైగర్ కిరణ్ మృతి.. తండ్రి, తాత సైతం..

ప్రతీకాత్మక చిత్రం

రాయల్ బెంగాల్ వైట్ టైగర్(కిరణ్-8) కొంతకాలంగా కుడిపైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్ కణితితో బాధపడుతుంది. దీనికి కొద్దిరోజులుగా ల్యాంకోన్స్ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, జూపార్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

  • Share this:
    హైదరాబాద్‌లోని జూపార్కులో విషాదం చోటుచేసుకుంది. పార్కుకే హైలెట్‌గా నిలిచే రాయల్ బెంగాల్ వైట్ టైగర్(కిరణ్-8) ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. గతంలో కిరణ్ తాత రుద్ర సైతం 12 ఏళ్ల వయస్సులో ఇదే వ్యాధితో చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పుట్టిపెరిగిన రాయల్ బెంగాల్ వైట్ టైగర్(కిరణ్-8) కొంతకాలంగా కుడిపైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్ కణితితో బాధపడుతుంది. దీనికి కొద్దిరోజులుగా ల్యాంకోన్స్ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, జూపార్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం చనిపోయింది.

    అయితే కిరణ్ తండ్రి బద్రి, కిరణ్ తాత రుద్ర సైతం ఇదే న్యూయో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ మరణించాయి. మృతిచెందిన కిరణ్(టైగర్)కు వైద్యులు వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ట్యూమర్ వ్యాధితో టైగర్లు చనిపోతుండడం పట్ల జూపార్కుకు కళ తప్పుతోంది.
    First published: