(Nagaraju, News18, Nalgonda)
Poet Rojadevi: నల్లగొండలోని సూర్యాపేట (Suryapet)జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తులు రోజాదేవి (Roja devi) విశ్రాంతి ఉపాధ్యాయురాలు. అంతేకాక లయన్స్ క్లబ్ కార్యదర్శి.. అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
సరళమైన భాషలో రచనలు
ఆమెకు మొదటి నుంచి సాహిత్యం (literature) మీద మక్కువ ఉండేది. అందుకే గేయరచన.. లతిత సంగీత గానం.. సన్మానపత్ర రచన.. వచనకవితారచన..సామాజిక స్పృహతో సరళమైన భాషలో రచనలు (Writings) చేసేవారు.
తానా అంతర్జాతీయ గేయకవితల పోటీలు
ఎన్నో కవి (Poet) సమ్మేళనాల్లో పాల్గొన్ని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచస్థాయి కవితా పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA)..ఆజాదీకా అమృతమహెత్సవ్ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ గేయ కవితల పోటీల్లో పాల్గొన్నారు. ఇటీవల జూమ్ మీటింగ్‌లో నిర్వహించిన ప్రపంచ స్థాయి వేదిక మీద ఆమె (Poet Rojadevi) స్వయంగా రాసిన కవితను ఆలపించారు. ప్రకృతి అంద చందాలను వర్ణిస్తూ ఆమె రాసిన ‘’ఎవరో మెచ్చిన దాతలు’’ గేయాన్ని సుద్దాల అశోక్‌తేజ ముందు ఆలపించారు.
కవి సమ్మేళనాలు
రోజాదేవి (Poet Rojadevi)కి వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న అనుభవం ఉంది. అంతేకాక ఉషోదయ సాహితి సంస్థ వారి సాహితి కిరణాలు చైతన్య స్రవంతి గ్రంథాలలో ఆమె రాసిన గేయాలు..కవితలు పబ్లిష్ అయ్యాయి.
ఉత్తమ ఉపాధ్యాయురాలు
2013లో రోజాదేవి ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు అందుకున్నారు. అంతేకాదు రాష్ట్రస్థాయి సావిత్రీ బాయి పూలే అవార్డు.. ఉత్తమ కవయిత్రి అవార్డు.. హోప్ స్వచ్ఛందసంస్థ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసా పత్రం.. ప్రపంచ తెలుగు మహసభలలో సన్మానం.. 2018 జూన్ 2న జిల్లా కలెక్టర్ కవితా పురస్కారం అందుకున్నారు.
సాహిత్యంతో పాటు పుస్తకరచనలు
సామాజిక స్పృహ సరళమైన భాషలో రచనలు చేసే రోజాదేవి పుస్తకాలు కూడా రాస్తుంటారు. పాటల పల్లకి, శ్రీరామ రక్ష అనే రెండు పుస్తకాలను రచించి ముద్రించారు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలిగా..లయన్స్ క్లబ్ మెంబర్‌గా రాణిస్తున్న ఆమె సూర్యపేట జిల్లాఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రోజాదేవిపై సాహితి వేత్తలు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Reading books, Suryapet