కనకదుర్గ ఆలయంలో దొంగ.. అమ్మవారి ఆభరణాలు చోరీ

సీసీ కెమెరాకు చిక్కిన దొంగ దృశ్యాలు

ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది.

  • Share this:
    నల్గొండలోని ఓ ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గుడిలోకి చొరబడి ఆభరణాలు,  హుండీలోని నగదును దోచుకెళ్లారు. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కనకదుర్గ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమ్మ వారి విగ్రహంపై ఉన్న ముక్కు పుడక, కిరీట, కవచం, ఇతర ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 12 కిలోల వెండి, 2 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయని వెల్లడించారు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన  ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది.

    చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో  రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: