Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

తుక్కైన బస్సు ముందు భాగం

Road Accident: బస్సు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. వానాకాలం రాగానే ఈ ప్రమాదాలు మరింత ఎక్కువవుతున్నాయి. తాజా ప్రమాదానికి కారణమేంటి? ఎలా జరిగింది?

  • Share this:
    Bus Accident: నల్గొండ జిల్లా... మిర్యాల గూడ హైవేలో రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఇద్దరు చనిపోగా... మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. గాయపడిన మరికొందరికి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య 10 మంది దాకా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు.

    మృతులను మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా గుర్తించారు. ఈ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తోంది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. అందువల్లే లారీని ఢీకొట్టాడని తెలుస్తోంది. అంతకుముందు కూడా దాచేపల్లి దగ్గర ఓ ఆటోను ఢీకొట్టబోయి... కొద్దిలో తప్పించాడని తెలిసింది.

    ఇది కూడా చదవండి: Gold Price Today: నగలు కొనుక్కోవాలా.. త్వరపడండి.. లేదంటే ధరల మోతే!

    బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా నిద్రమత్తుతో బస్సు తోలవద్దని చెప్పినా... అతను వినిపించుకోలేదని తెలిసింది. తాజాగా రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం తుక్కుతుక్కైంది. డ్రైవర్‌కి కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు రాశారు. దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: