హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గచ్చిబౌలిలో టిప్పర్ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు టిప్పర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానాకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చెసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటుకి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించనున్నారు.
ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.