హోమ్ /వార్తలు /తెలంగాణ /

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. పాప సహా ముగ్గురు మృతి

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. పాప సహా ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం (image credit - twitter - @TeluguScribe)

ఘోర రోడ్డు ప్రమాదం (image credit - twitter - @TeluguScribe)

Road Accident : రోడ్డు ప్రమాదాలకు నాలుగు అంశాలు కారణం అవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్, నిద్ర మత్తులో డ్రైవింగ్. ప్రపంచంలో చాలా రోడ్డు ప్రమాదాలకు ఇవే కారణాలవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జనగామ - పెంబర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే... ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు వేగంగా వచ్చి బోల్తా కొట్టింది. దాంతో కారు పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు డీసీఎం డ్రైవర్, క్లీనర్.. డీసీఎం టైర్ పంక్చర్ కావడంతో దాన్ని మార్చే పనిలో ఉన్నారు. అంతలోనే ఊహించని వేగంతో వచ్చి కారు ఢీకొట్టడంతో.. వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పల్టీ కొట్టిన కారులో ఆరేళ్ల పాప కూడా చనిపోయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు. కారులో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ , కొండాపూర్‌కి చెందిన ఫ్యామిలీ కారులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం లేదా నిద్ర మత్తులో డ్రైవింగ్ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. కేసు రాసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

కారు బీభత్సం :

హైదరాబాద్‌లో తెల్లవారు జామున ఓ కారు అతి వేగంతో దూసుకొచ్చింది. వనస్థలిపురం.. ఎన్జీఓస్ కాలనీలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు.. షాప్‎ల పైకి దూసుకెళ్లింది. ఈ కారు వచ్చినప్పుడు కొందరు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. లక్కీగా వారికి ఏమీ కాలేదు. కారులో ఉన్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వారి మద్యం తాగి డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. కేసు రాసిన పోలీసులు.. ఆ యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా రకరకాల కారణాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తున్నాయి. మన సౌలభ్యం కోసం చేసుకున్న వాహనాలను మనమే కంట్రోల్ లేకుండా నడుపుతూ.. విషాదాలకు కారణం అవుతున్నామని నిపుణులు అంటున్నారు.

First published:

ఉత్తమ కథలు