Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

Warangal Road Accident: అంతా క్షణాల్లో జరిగిపోయింది. కాలం వెనక్కి వెళ్తే బాగుండనిపించే దుర్ఘటన. ప్రమాదంతో ఏమాత్రం సంబంధం లేని ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

news18-telugu
Updated: September 2, 2020, 6:23 AM IST
Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి (File)
  • Share this:
Warangal Road Accident: వరంగల్‌ రూరల్ జిల్లా... దామెర మండలం... పసరగొండ దగ్గర బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఇసుక లారీ ఢీకొట్టడంతో... కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తూ... లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఇంతలో బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. డ్రైవర్ కళ్లు తెరిచేసరికే... అంతా అయిపోయింది. కారు తుక్కుతుక్కైంది. పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి తన సిబ్బందితో వెళ్లి... సహాయ చర్యలు చేపట్టారు. కారు ఎంతలా తుక్కైందంటే... చనిపోయిన వారు... కారులో ఇరుక్కుపోయారు. మృతదేహాల్ని బయటకు తీయడం కష్టంగా మారింది. ఎలాగొలా బయటకు తీసి... పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

చనిపోయిన వాళ్లంతా వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరణించిన వారిని చందు, మేకల రాకేశ్‌, పవన్, రోహిత్‌, సాబీర్‌‌గా‌ గుర్తించారు. వారంతా ములుగువైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదం ద్వారా మనకు అర్థమయ్యేది ఒకటే. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు... ముందు మాత్రమే కాదు... వెనకవైపు, చుట్టుపక్కల కూడా చూసుకుంటూ ఉండాల్సిందే. లేదంటే మృత్యువు ఎటు నుంచైనా విరుచుకుపడొచ్చు అంటున్నారు పోలీసులు.
Published by: Krishna Kumar N
First published: September 2, 2020, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading