తెలంగాణలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

ఓవైపు దేశమంతా లాక్‌డౌన్ ఉన్నా... రోడ్లపై ట్రాఫిక్ సమస్య లేకపోయినా... రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉండటం విచారకరం.

news18-telugu
Updated: March 28, 2020, 5:55 AM IST
తెలంగాణలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana : అది రంగారెడ్డి జిల్లా. పెద్ద గోల్కొండలోని ఔటర్ రింగురోడ్డు. టాటా ఏస్ వాహనం కాస్త వేగం తగ్గింది. రింగు రోడ్డుపై మరీ ఎక్కువ వేగం వద్దనుకున్నారు. ఇంతలో ఓ లారీ డ్రైవర్ రివర్సులో ఆలోచించాడు. రింగు రోడ్డు కాబట్టి మరింత ఎక్కువ వేగంతో వెళ్లాలనుకున్నాడు. కానీ అతని ఆలోచన తప్పైంది. కొద్ది సేపటి తర్వాత బండి అదుపు తప్పుతుంటే... స్టీరింగ్‌తో కంట్రోల్ చెయ్యలేకపోయాడు. దాంతో లారీ వెళ్లి... టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ తుక్కుతుక్కైంది. అందులోని ఐదుగురు కూలీలు చనిపోయారు. వాళ్లంతా కర్ణాటకకు చెందిన వారిగా తెలిసింది. కరోనా వైరస్ వ్యాపిస్తోంది కదా... దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కదా అని వాళ్లు కర్ణాటకలోని సొంతూళ్లకు వెళ్తున్నట్లు తెలిసింది. వాళ్లు ఒకటి తలిస్తే... విధి మరొకటి తలచినట్లైంది.

First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading