RIP Arun Jaitley : అరుణ్ జైట్లీ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి...

బీజేపీ మోస్ట్ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 12:57 PM IST
RIP Arun Jaitley : అరుణ్ జైట్లీ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి...
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ప్రెస్ నోట్
Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 12:57 PM IST
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూతపై తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ పార్లమెంటేరియన్‌గా, మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

arun jaitley,arun jaitley health,arun jaitley in aiims,arun jaitley aiims,arun jaitley health condition,arun jaitley news,arun jaitley in hospital,arun jaitley latest news,finance minister arun jaitley,arun jaitley latest,arun jaitley health news,arun jaitley admitted to aiims,arun jaitley admitted in aiims,arun jaitley health latest news,arun jaitley admitted to hospital,arun jaitley speech, అరుణ్ జైట్లీ, అరుణ్ జైట్లీ అస్తమయం, అరుణ్ జైట్లీ కన్నుమూత, అరుణ్ జైట్లీ మరణం,
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ప్రెస్ నోట్


అరుణ్ జైట్లీకి సీరియస్‌గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈనెల 9న ఎయిమ్స్‌కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మరికొన్ని రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...