నేడు తెలంగాణ బంద్?... నాగోలులో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

Telangana Bandh : హైదరాబాద్... అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఇవాళ తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: November 5, 2019, 5:47 AM IST
నేడు తెలంగాణ బంద్?... నాగోలులో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ
  • Share this:
Telangana Bandh : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్యోదంతం తెలంగాణను కుదిపేసింది. సీఎం కేసీఆర్ సహా ప్రతి ఒక్కరూ ఈ అమానవీయ హత్యను ఖండించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కౌలు రైతు సురేష్... ఆమె ఛాంబర్‌లో తలుపులు మూసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. తనకు భూమి పట్టా రాదనే ఉద్దేశంతో ఆమెను చంపేశాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్... తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో రైతుకూ, సురేష్‌కి కూడా మంటలు అంటుకున్నాయి. విజయారెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అక్కడ విగతజీవిగా ఉన్న ఆమెను చూసి... కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రమయ్యారు. ఆమె భర్త సుభాష్‌ రెడ్డి, తల్లి వినోద, తండ్రి లింగారెడ్డి, పిల్లల్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఎల్బీనగర్‌లోని ఇంటికి తరలించారు. ఇవాళ ఉదయం నాగోలులో అంత్యక్రియలు జరగనున్నాయి.

telangana bundh, telangana news, telangana updates, telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, తెలంగాణ న్యూస్, తెలంగాణ అప్ డేట్స్, తెలంగాణ బంద్,
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ


తెలంగాణ బంద్‌కి పిలుపు : ఈ దారుణంపై భగ్గుమన్నాయి రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసి... నల్ల బ్యాడ్జీలు, కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇవాళ్టి నుంచీ మూడ్రోజులపాటూ... విధులు బహిష్కరిస్తున్నారు. అలాగే... నేడు తెలంగాణ బంద్ ప్రకటించారు. ఈ బంద్‌కి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా... జరిగిన ఘటనను ఖండిస్తూ... ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కి సహకరించే అవకాశాలున్నాయి. మూడు రోజులు విధుల బహిష్కరణ తర్వాత... ప్రభుత్వం నుంచీ తమకు స్పష్టమైన హామీ వస్తేనే తిరిగి విధులు ప్రారంభిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ


విజయారెడ్డి ప్రస్థానం : తహసీల్దార్‌ విజయారెడ్డి సొంత ఊరు నల్గొండ జిల్లా... శాలిగౌరారం మండలం పెర్కకొండారం. రిటైర్ట్ టీచర్ లింగారెడ్డి దంపతుల రెండో కూతురు ఆమె. నల్గొండలో డిగ్రీ చేసిన ఆమెకు... 13 ఏళ్ల కిందట సుభా‌ష్ రెడ్డితో పెళ్లైంది. వాళ్లకు కూతురు చైత్ర(11), కొడుకు అభినవ్‌(7) ఉన్నారు. సుభాష్ రెడ్డి... హయత్‌నగర్‌ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. విజయారెడ్డి 2004లో ప్రభుత్వ టీచర్‌గా ఎంపికయ్యారు. 2009లో గ్రూప్‌-2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌ అయ్యారు. 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి తహసీల్దార్‌గా ప్రమోషన్‌పై వచ్చారు. అలాంటి ఆమెను హత్య చేయడంతో... ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏజెంట్ సాయి శ్రీనివాస మూవీ హీరోయిన్ శ్రుతి శర్మ క్యూట్ స్టిల్స్

ఇవి కూడా చదవండి :

మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?

Bigg Boss 3 | శ్రీముఖికి ప్లస్సా, మైనస్సా?

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...

Published by: Krishna Kumar N
First published: November 5, 2019, 5:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading