రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. తహశీల్దార్ హత్య నేపథ్యంలో..

భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని.. అందుకోసం సిబ్బంది మొత్తంలో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై చట్టాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:18 PM IST
రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. తహశీల్దార్ హత్య నేపథ్యంలో..
భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని.. అందుకోసం సిబ్బంది మొత్తంలో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై చట్టాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
  • Share this:
తహశీల్దార్ విజయా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనలతో రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతేకాదు పలువురు రైతులు పెట్రోల్ బాటిళ్లతో తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్తుండడంతో భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీస్ భద్రత కల్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎమ్మార్వో ఆఫీసుల వద్ద సీసీ కెమెరాలతో పాటు అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

కలెక్టర్ వద్ద ఉన్న నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని.. అందుకోసం సిబ్బంది మొత్తంలో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై చట్టాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మార్వో కార్యాలయంలోనే ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది.
Published by: Shiva Kumar Addula
First published: November 13, 2019, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading