సీఎం కేసీఆర్ (Cm Kcr) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మా తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది నువ్వే కదా..మా 37 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసింది నువ్వే కదా అని రేవంత్ (Revant Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుకుకు ఎదురే ఉండదని అనుకున్నారు. కానీ ఆవు లాంటి పార్టీకి అన్యాయం చేస్తే ఆ పాపం ఊరికే పోతుందా అన్నారు. గతంలో నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. కనీసం నా బిడ్డ లగ్న పత్రికకు కూడా వెళ్లనివ్వలేదు. ఇప్పుడేమో వగల ఏడుపులు ఏడుస్తున్నారు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా అని రేవంత్ (Revant Reddy) తీవ్ర విమర్శలు చేశారు.
నేను సీఎం కాకపోయిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..
ఇక నేను సీఎం అయినా కాకపోయినా కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావాలని రేవంత్ (Revant Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎపుడైనా ఎన్నికలు రావొచ్చు. కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఇక కేసీఆర్ ముందు డిమాండ్స్ పెట్టేది లేదని అన్నారు. ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏలికలు, పేలికలుగా చీలుతుందని రేవంత్ రెడ్డి (Revant Reddy) జోస్యం చెప్పారు.
నిన్న మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ (CM KCR).. కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించిన అనంతరం.. ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన దొంగలను పట్టుకొని జైల్లో వేశామని అన్నారు. తెలంగాణ మారినట్లుగానే.. దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిసులపై స్పందించిన కవిత సీబీఐకి లేఖ రాసింది. కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీని పంపించాలని కోరింది. ఈ మేరకు FIR కాపీని వెబ్ సైట్ లో ఉంచారు. అయితే ఈ FIR కాపీలో తన పేరు లేదని, రేపు సీబీఐ విచారణకు అందుబాటులో ఉండలేనని మరోసారి కవిత లేఖ రాసింది. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటా అని ఆమె తెలిపింది. నేను చట్టాన్ని గౌరవిస్తా..దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అని కవిత పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mp revanthreddy, Revanth Reddy, Telangana, Trs, TS Congress