హోమ్ /వార్తలు /తెలంగాణ /

రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ ఎవరో తెలుసా...? ట్రాన్స్‌జెండర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు...

రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ ఎవరో తెలుసా...? ట్రాన్స్‌జెండర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు...

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

తెలంగాణలోని ఏకైక నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు సంప్రదాయాన్ని రద్దు చేయాలని పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు. అయితే ఆంగ్లో ఇండియన్‌లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు ఇవ్వాలనే బ్రిటిష్ కాలం నాటి పద్ధతిని ఇంకా కొనసాగించడం సబబు కాదని దన్నారు.

ఇంకా చదవండి ...

    మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా విజయంతో జోష్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వంత నియోజకవర్గం కొడంగల్ లో దారుణ పరాజయం మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి... ప్రస్తుతం మాత్రం దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో గెలవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గెలిచిన వెంటనే రేవంత్ తన టార్గెట్ సెట్ చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ఏకైక నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు సంప్రదాయాన్ని రద్దు చేయాలని పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు. అయితే ఆంగ్లో ఇండియన్‌లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు ఇవ్వాలనే బ్రిటిష్ కాలం నాటి పద్ధతిని ఇంకా కొనసాగించడం సబబు కాదని దన్నారు. ఇదిలా ఉంటే నోటుకు ఓటు కేసు ద్వారా తన రాజకీయ జీవితంలో దుమారం సృష్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టార్గెట్ చేసుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావిస్తున్నారు. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టులను ఆంగ్లో ఇండియన్‌లకు కేటాయించే బదులు ట్రాన్స్‌జెండర్లకు కేటాయించాలని డిమాండ్ చేస్తానని రేవంత్ ప్రకటించారు.ఇదిలా ఉంటే ఎంపీ సీటు గెలిచిన జోష్ రేవంత్ రెడ్డికి కొత్త బలాన్నిచ్చింది. దీంతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నానని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేశారు.


    నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరునెలలుగా మౌనంగా ఉన్న రేవంత్ రెడ్డి, పార్లమెంటు ఎన్నికల్లో సైతం సైలెంట్ గానే ప్రచారం నిర్వహించుకున్నారు. పెద్దగా హడావిడి లేకుండా ప్రచారం సాగిపోయింది. అయితే చాపకింద నీరులా రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో తన వ్యూహాన్ని అమలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి సీటు టీడీపీ కైవసం చేసుకుంది. అయితే టీడీపీ నుంచి అప్పటి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్ కు జంపయ్యారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు ఉన్నాయని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. కేవలం ఎల్బీనగర్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని భావించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చాపకింద నీరులా ప్రచారాన్ని కొనసాగించారు. ముఖ్యంగా తెలుగు దేశం సానుభూతి పరుల ఓట్లతో పాటు, తన సామాజిక వర్గం ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఓట్లు తనకే పడేట్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ రేవంత్ వేసుకున్న లెక్కలు కలిసొచ్చాయి. దీంతో రేవంత్ గెలుపు సాధ్యమైంది.

    First published:

    Tags: Malkajgiri S29p07, Revanth reddy

    ఉత్తమ కథలు