రేవంత్ రెడ్డి నయా అవతార్... ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో హల్‌చల్

Revanth Reddy | కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: August 28, 2019, 11:47 AM IST
రేవంత్ రెడ్డి నయా అవతార్... ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో హల్‌చల్
రేవంత్ రెడ్డి (File)
  • Share this:
పదునైన మాటలతో ప్రత్యర్థులను టార్గెట్ చేసే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి... కొద్దిసేపు ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మారిపోయారు.రాజకీయాల్లోనే కాదు.. తాను మైదానంలో కూడా చెడుగుడు ఆడేస్తానని ఆయన నిరూపించాడు. రంగారెడ్డి జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు తదితర ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి... మైదానంతో దిగి కాసేపు ఫుట్‌బాల్ ఆడారు. ఏదో కెమెరాలకు ఫోజులిచ్చే విధంగా ఆడకుండా... డ్రెస్ మార్చేసి మరీ ప్రొఫెషనల్‌గా మైదానంలోకి దిగిపోయారు. స్వయంగా తన ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి... అత్యంత పెద్దదైన తన నియోజకవర్గంలో నిత్యం ఏదో ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకోవడంతో పాటు అన్ని వర్గాల వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు తదితర ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి వెళ్లిన రంగారెడ్డి తాజాగా డ్రెస్ మర్చేసి వారితో ఫుట్‌బాల్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: August 28, 2019, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading