ఆరుగాలం కష్టపడి పండిచిన పసుపు పంటకు ఈయేడు కూడా మద్దతు ధర లేక రైతన్నలు నష్టపోతుననారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి తొమ్మిది నెలలు చిడపీడల నుంచి పంట రక్షించి పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. పెట్టుబడి కూడా రావడం లేదు. మరో 15 రోజుల్లో పసుపు పంట చేతికి వస్తుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు పసుపు రైతుల సమస్యలపై దృష్టి పెట్టాయి. పసుపుబోర్డు, కనీస మద్దతు ధర విషయంలో అధికార పార్టీలను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో ఒక్క రోజు దీక్ష చేసేందుకు రానుండటం జిల్లాలో రాజకీయం వెడెక్కింది. నిజామాబాద్ జిల్లాలో గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా పసుపు రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం దేశం దృష్టిని ఆకర్షించింది.
పసుపు బోర్డు ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిలిచాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు ముందుకేసీ బాండ్ పేపర్‌పై వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తాను లేకపోతే పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని రాసి ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. పసుపు బోర్డు తీసుకు వస్తావా... లేక రాజీనామా చేస్తావా.. అని రైతు సోదరులతో కలిసి ప్రశ్నిస్తున్నాయి.
పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ నెల 30న ఆర్మూర్‌లో ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే దీక్షకు వస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేస్తారా ? లేక అంతకుముందు నిజామాబాద్ ఎంపీగా వ్యవహరించిన టీఆర్ఎస్ ముఖ్యనేత కవితను టార్గెట్ చేస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసినా.. రేవంత్ రెడ్డి ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం, కవితను టార్గెట్ చేసుకునే అవకాశాలే ఉన్నాయనే చర్చ సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Kalvakuntla Kavitha, Nizamabad, Revanth Reddy, Telangana