Home /News /telangana /

Revanth reddy : హుజూరాబాద్‌పై ప్రత్యేక వ్యూహం.. రెండు రోజుల్లో కాంగ్రేస్ అభ్యర్థి..

Revanth reddy : హుజూరాబాద్‌పై ప్రత్యేక వ్యూహం.. రెండు రోజుల్లో కాంగ్రేస్ అభ్యర్థి..

Revanth reddy

Revanth reddy

Revanth reddy : హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని రెండు లేదా మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హుజూరాబాద్ ఎన్నికపై కాంగ్రేస్ పార్టీకి ప్రత్యేక వ్యూహం ఉందని ఆయన చెప్పారు. ఇతర కాంగ్రేస్ పార్టీ నేతలే ఎమ్మెల్యేలుగా పోటి చేస్తారని అన్నారు.

ఇంకా చదవండి ...
    టీఆర్ఎస్ (trs)ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలకు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి(Revanth reddy) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరుతో ఆక్టొబర్ 2 నుండి 9 వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేంగా పలు కార్యక్రమాలు తీుసుకున్నది.

    ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులే ప్రాణాలు అర్పించారు తప్ప.. నాయకులు కాదని అన్నారు. మలిదశ ఉద్యమంలో విద్యార్థులదే కీలకపాత్ర అని అన్నారు. వందలాది విద్యార్థుల ప్రాణత్యాగాల వల్ల స్వరాష్ట్రం సాకారమైందన్న ఆయన... విద్యార్థుల ఆత్మబలిదానాలను రాజకీయంగా వాడుకున్నారని తెరాసపై విమర్శలు గుప్పించారు. ఆనాడు విద్యార్థుల ఉద్యమాన్ని కేసీఆర్‌ ఆక్రమించారని ఆరోపించారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమం చేశారని పేర్కొన్నారుి

    ఇది చదవండి : ఓటర్ల తిట్లదండకంపై ఈటల.. ఆదరణను భరించలేకనే టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు..


    ఇది చదవండి : వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ... ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్..ఆ తర్వాత...!


    60 లక్షల విద్యార్థి నిరుద్యోగ యువత.. పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్​(kcr) చేతిలో బంధి అయ్యారని ఆరోపించారు. కనీసం తమ హక్కుల గళాన్ని సైతం వినిపించకుండా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఆఖరి పోరాటంగా విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమాన్ని​ ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్​ 2 నుంచి డిసెంబర్​ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజలు.. ఆరాధించే తెలంగాణ తల్లి... కేసీఆర్​ కుటుంబం చేతిలో బంధీ అయిందని విమర్శించారు.
    విద్యార్థి నిరుద్యోగ సైరన్​ పేరుతో... అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు వివిధ రూపాల్లో ఆఖరి పోరాటంగా కాంగ్రెస్​ కార్యచరణ తీసుకుందని చెప్పారు. తెలంగాణ తల్లి... ఇప్పుడు కేసీఆర్​ చేతుల్లో బంధీ అయింది.. విద్యార్థుల గళాన్ని వినిపిస్తాం. తెరాస ... విద్యార్థుల ఆత్మబలిదానాలను రాజకీయంగా వాడుకుందని ఆయన దుయ్యబట్టారు.. ఈ సంధర్బంగా నిరుద్యోగ భృతి ఇస్తారా లేదా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల వల్ల వేలమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నరని.. బకాయిలు ఉన్న 4వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Congress, Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు