కొడతారేమోనని రాలేదు...రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య సరదా సంభాషణ

''నేను మిమ్మల్ని కొట్టానా? మీరు నన్ను కొట్టారా?'' అని గతంలో అసెంబ్లీలో జరగిన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేశారు గవర్నర్ నరసింహన్. అది మనసులో పెట్టుకొనే కొడతారేమోనని అందుకే రాలేదని బదులిచ్చారు రేవంత్ రెడ్డి.

news18-telugu
Updated: August 15, 2019, 8:49 PM IST
కొడతారేమోనని రాలేదు...రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య సరదా సంభాషణ
నరసింహన్, రేవంత్ రెడ్డి
  • Share this:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోమ్' కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తనను కలిసిదుకు వచ్చిన రేవంత్ రెడ్డితో గవర్నర్ సరదాగా మాట్లాడారు. తేనీటి విందుకు వచ్చావో..లేదో.. నీ కోసమే చూస్తున్నానని రేవంత్‌తో అన్నారు గవర్నర్. మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా.. అని బదులిచ్చారు రేవంత్. ''నన్ను కలవడానికి వస్తానన్నారు.రాలేదేంటి.?'' అని గవర్నర్ అడగ్గా రేవంత్ రెడ్డి ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. మీరు కోడతారేమోనని భయమేసిందని అందుకే రాలేదని వ్యాఖ్యానించారు.

''నేను మిమ్మల్ని కొట్టానా? మీరు నన్ను కొట్టారా?'' అని గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేశారు గవర్నర్ నరసింహన్. అది మనసులో పెట్టుకొనే కొడతారేమోనని.. అందుకే రాలేదని బదులిచ్చారు రేవంత్ రెడ్డి. అంతే కాదు షబ్బీర్ అలీతోనూ గవర్నర్ సరదాగా సంభాషించారు. నాపై ఎందుకు కోపంగా ఉన్నారని ఆయన షబ్బీర్‌ని అడిగారు. మధ్యలో రేవంత్ కలగజేసుకొని..''ఆయన బిర్యానీ పెడతారు తప్ప ఎవ్వరీ కోపగించుకోరు.'' అని అన్నారు. ఐతే ఆయన బిర్యానీ తినరు కదా.. అని గవర్నర్ సతీమణి అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు