ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఓవైపు కేంద్రం ధాన్యం కొనుగోళుపై స్పష్టత ఇవ్వడం లేదు.. దీంతో స్పష్టత ఇచ్చేదాకా తాము కదలమంటూ టీఆర్ఎస్ మంత్రులు కూర్చున్నారు.. మరో కొద్ది రోజులు చూసి వెనక్కి వచ్చేందుకు వారు సిద్దమయ్యారు.. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ సైతం టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై ఏటు తేలకుండా హైదరాబాద్‌కు రావద్దని అన్నారు. ఒకవేళ వారు వస్తానంటే వారిని ఆడంగులు ,కొజ్జాలతో పాటు గాజులు, చీరలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరోవైపు టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేయడంతో పాటు వీధినాటకాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు.. వరంగల్ గోడౌన్ లోని 25 వేల మెట్రిక్ టన్నుల బొయ్యం గోల్ మాల్ పై కేంద్రం నిలదీస్తే దొంగళ్ల పారిపోయి వచ్చారని ఆరోపించారు.సెంట్రల్ హాల్ లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ఆందోళన చేసినట్లు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. .ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇక రైతుల బృందంలో కేటీఆర్, సంతోష్ రావు లేకుండా విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Nalgonda : ట్రాన్స్‌జెండర్స్‌తో ఫ్రెండ్షిప్.. నమ్మిన వారే నరకం చూపించారు.. తల, మొండెం వేరు చేసి.
.Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు
కేంద్రం నుండి స్పష్టత వచ్చే వరకు యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీ లో ఆమరణ దీక్ష చేయాలని ఆయన సూచించారు.. రైతు సమస్యలపై డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తాం మని , రైతులంతా ఎర్రవెల్లికి రావాలని ఆయన పిలుపునిచ్చారు..
Hyderabad : దారుణం.. సహజీవనం వద్దని వెళ్లిన మహిళ సజీవదహానం.. ?
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paddy, Revanth Reddy, Tpcc, Trs