Revanth reddy : " మంత్రి మల్లారెడ్డి పచ్చి దొంగ.. లఫంగ్‌.".భూ కబ్జాలపై ఇవిగో ఆధారాలు.. !

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth reddy : మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. యూనివర్శిటి భూములతో పాటు ,ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రిలో కూడా భూముల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు. వీటిపై సీఎం కేసిఆర్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 • Share this:


  మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిల (Revanth reddy )మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.. ఇద్దరి నేతల మధ్య భూముల అక్రమాలపై మాటల యుద్దంపై రాజకీయా (ts politics ) చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, మల్కజ్‌గిరి శాసన సభ నియోజకవర్గంలోని సీఎం (cm kcr )దత్తత గ్రామం అయిన మూడు చింతల పల్లిలో రెండు రోజుల పాటు దీక్ష చేపట్టిన సంధర్భంలో మంత్రి మల్లారెడ్డి యూనివర్శిటీ (University )భూములపై కబ్జా ఆరోపణలు చేశారు.

  అయితే ఇందుకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన భూములకు సంబంధించి ఎలాంటీ అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందే 600 ఎకరాల భూమి ఉందని అన్నారు. తన కష్టార్జితమే తప్పా ఎలాంటీ అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మల్లారెడ్డి (y  mallaredd) సవాల్ సైతం విసిరాడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటి దిగాలని సవాల్ విసిరాడు. ఇద్దరు కలిసి పోటి చేద్దామని చెప్పిన మల్లారెడ్డి ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఇందుకోసం ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నాని మల్లారెడ్డి సవాల్ విసిరాడు. తన యూనివర్శిటిలో ఎలాంటీ అక్రమాలు జరగలేదని స్పష్టం చేశాడు..

  ఇది చదవండి : మంత్రి మల్లారెడ్డి తిట్ల దండకానికి ఓకే చెప్పిన హైకమాండ్ .. ఓపిక నశించిందన్న యువ నేత


  ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి భూముల అక్రమాలపై స్పందించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజిలతో (medical collage )పాటు ఇటివల అనుమతి ఇచ్చిన యూనివర్శిటికి సంబంధించి పలు సర్వే నంబర్‌లో అక్రమాలు జరిగినట్టు ఆయన మీడియా ముందుకు సరైనా ఆధారాలతో పాటు నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని ఆయన చెప్పారు. దీనిపై సీఎం కేసిఆర్ ఎలాంటీ చర్చ తీసుకుంటారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు.

  కాగా మల్లారెడ్డి యూనివర్శిటికి సంబంధించి గుండ్ల పోచంపల్లిలోని సర్వే నంబర్ 650లో 22 ఎకరాల భూమికి సంబంధించి మల్లారెడ్డి యూనివర్శిటి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మల్లారెడ్డి రియల్ ఎస్టెట్ వ్యాపారి (Real estate )నుండి బెదిరించి భూములు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు మల్లారెడ్డి యూనివర్శిటికి పెట్టిన 22 ఎకరాల భూమి ఆయన బావమరిది శ్రీనివాస రెడ్డి నుండి గిప్టు డీడీ గా వచ్చిందని, ఇందులో శ్రీనివాస రెడ్డి ఆ భూములకు ఎలా యజామాని అయ్యాడని ఆయన ప్రశ్నించాడు.

  మరోవైపు జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 488 సర్వే నంబర్ లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిగా నిషేధిత భూమిగా రికార్డులో ఉండగా,దీనిపై రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూమిగా బోర్డు కూడా పాతారని అన్నారు. అయితే ఈ భూమి మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి పేరు మీద ఉందని ,ఆ ప్రాంతంలో సీఎంఆర్ ఆసుపత్రి నిర్మించి వ్యాపారం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిషేధిత భూమి మల్లారెడ్డి కోడలు పేరుమీద ఎలా రిజిస్ట్రేషన్ అయిందని ఆయన ప్రశ్నించారు. అక్రమాల విషయంలో ఇతర మంత్రులకు వర్తించిన నిబంధనలు మల్లారెడ్డికి వర్తించవా అని ఆయన ధ్వజమెత్తారు.

  ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పేరుతో విద్యార్థుల తప్పుడు పత్రాలతో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు చెబుతున్నాయని,ఇక దళితుల భూములను ఆక్రమించారని ఈటల రాజేందర్‌నను మంత్రివర్గం నుండి తొలగించిన సీఎం, దళిత ఉపమంత్రి రాజయ్యపై కూడా అవినీతి అక్రమాలు వచ్చాయంటూ తొలగించారని మరి ఇన్ని ఆక్రమణలు చేసిన మల్లారెడ్డిని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకొని ప్రోత్సహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
  Published by:yveerash yveerash
  First published: