తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తీవ్రం ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థూపంలో కూడా సీఎం కేసిఆర్ కోట్ల రూపాయలు కొళ్లగొట్టాడని అందుకే ఆయన్ను తెలంగాణ సమాజం బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు అమరవీరుల స్థూపం అంచనాలను సైతం మూడు వందల శాతం పెంచి దాని నిర్మాణ కాంట్రాక్టును కూడా ఆంధ్రా వారికి కట్టబెట్టరని ఆరోపణలు చేశారు. ఇందుకోసం నిర్మాణ సంస్థ నుండి కోట్ల రూపాయల డబ్బును కేటిఆర్‌కు ముట్టజెప్పారని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్‌తో ( cm kcr ) పాటు ఆయన కోటరి డిఎన్ఏను పరిక్షించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎందుకంటే తెలంగాణ ( Telangana ) అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్‌ను ఆంధ్రాకు చెందిన కంపనీ అప్పగించడం వెనుక అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.. వారికి ఎలాంటి అనుభవం లేకున్నా... కాంట్రాక్టులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. కన్సల్టెన్సీ పేరు మీద కూడా ఆరు శాతం కమీషన్ ఇవ్వడం వెనక అవినీతి దాగుందని అన్నారు. దాని నిర్మాణం కూడా ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా.. అమర వీరుల స్థూపం మొండి గోడలుగా కనిపించడం వెనక సీఎం కుట్ర దాగుందని అన్నారు. ఇలాంటీ టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు పూడ్చి పెట్టాలని ఆయన కోరారు.
Hyderabad : అక్రమ నిర్మాణాలపై మరోసారి ఫోకస్.. 30లోగా గుర్తించి కూల్చి వేయండి...ప్రభుత్వ ఆదేశాలు..
Odisha : సెలవుల కోసం.. నీళ్లలో విషం కలిపిన విద్యార్థి... చివరికి ఇలా అయింది...!
ముఖ్యమంత్రి కేసిఆర్ ( cm kcr ) తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తానంటూ అందరిని నమ్మించాడని అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అసులువు బాసిన కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ,ప్రతి ఇంటికి ఐదు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పడంతో పాటు అమరవీరుల స్థూపాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చర్యలు చేపడతామని సీఎం కేసిఆర్ చెప్పారని అన్నారు. కాని తెలంగాణ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తున్న అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. అంతకుముందు లుంబిని పార్క్ సమీపలంలో నిర్మాణం జరుగుతున్న అమరవీరుల స్థూపం పనులను ఆయన పార్టీ నేతలతో కలిసి పరీశీలించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Revanth Reddy